ప్రపంచకప్‌: స్టాండ్‌బైగా రాయుడు, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ

| Edited By: Ravi Kiran

Apr 17, 2019 | 7:14 PM

ఈ ఏడాది మే 30వ తేదీన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే పలు క్రికెట్ బోర్డులు ఈ మెగా టోర్నీ బరిలో దిగే జట్లను ప్రకటించాయి. సోమవారం ఈ మెగా టోర్నీకి బరిలోకి దిగే 15 మంది జట్టు సభ్యుల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో అంబటి రాయుడు, యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌లకు చోటు దక్కలేదు. దీంతో వాళ్లు కాస్త నిరాశకు గురయ్యారు. పంత్, రాయుడును జట్టులో ఎంపిక చేయకపోవడంపై […]

ప్రపంచకప్‌: స్టాండ్‌బైగా రాయుడు, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ
Follow us on

ఈ ఏడాది మే 30వ తేదీన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే పలు క్రికెట్ బోర్డులు ఈ మెగా టోర్నీ బరిలో దిగే జట్లను ప్రకటించాయి. సోమవారం ఈ మెగా టోర్నీకి బరిలోకి దిగే 15 మంది జట్టు సభ్యుల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో అంబటి రాయుడు, యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌లకు చోటు దక్కలేదు. దీంతో వాళ్లు కాస్త నిరాశకు గురయ్యారు. పంత్, రాయుడును జట్టులో ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పలువురు మాజీ క్రికెటర్లతో సహా, నెటిజన్లు సెలక్షన్ కమిటీపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరికి కాస్త ఊరటనిచ్చే విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. వీరిద్దరినీ ప్రపంచకప్‌ జట్టుకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్న పేసర్‌ నవ్‌దీప్‌ సైనీని సైతం స్టాండ్‌బై జాబితాలో చేర్చారు.