రాయుడు.. ఇక్కడకు రా.. మా దేశంలోనే ఉండిపో

| Edited By:

Jul 03, 2019 | 8:17 AM

ఈ ప్రపంచకప్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు స్థానం లభిస్తుందని చాలా మందే భావించారు. అయితే కొన్ని కారణాల వలన రాయుడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక ఇటీవల విజయ్ శంకర్ గాయంతో ఆటకు దూరం అవ్వడంతో.. అతడి స్థానంలోనైనా అంబటికి చోటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా బీసీసీఐ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అతడికి ఓ దేశం బంపర్ ఆఫర్ ఇచ్చింది. మా దేశానికి వచ్చెయ్.. ఇక్కడే […]

రాయుడు.. ఇక్కడకు రా.. మా దేశంలోనే ఉండిపో
Follow us on

ఈ ప్రపంచకప్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు స్థానం లభిస్తుందని చాలా మందే భావించారు. అయితే కొన్ని కారణాల వలన రాయుడిని సెలక్టర్లు పక్కన పెట్టేశారు. ఇక ఇటీవల విజయ్ శంకర్ గాయంతో ఆటకు దూరం అవ్వడంతో.. అతడి స్థానంలోనైనా అంబటికి చోటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా బీసీసీఐ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అతడికి ఓ దేశం బంపర్ ఆఫర్ ఇచ్చింది. మా దేశానికి వచ్చెయ్.. ఇక్కడే ఉండిపో అంటూ ఆ దేశ క్రికెట్ సంస్థ తెలిపింది.

‘‘రాయుడు 3డీ గ్లాసెస్‌ను ఇప్పుడైనా పక్కనపెట్టు. మామూలు అద్దాలతో డాక్యుమెంట్లు చదువు. వచ్చి మాతో చేరు. రాయుడంటే మాకెంతో ఇష్టం’’ అని ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఐల్యాండ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా దానికి జత చేసింది. అయితే ఐస్‌లాండ్ ఇచ్చిన ఈ ఆఫర్‌పై అంబటి రాయుడు ఇంకా స్పందించకపోగా.. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సెలక్టర్లకు గట్టి చెంపదెబ్బ తాకేలా ఐస్‌లాండ్ క్రికెట్ ఆఫర్ ఇచ్చిందని కొందరు.. ఈ ఆఫర్‌ను రాయుడు ఒప్పుకుంటే విదేశీ ఆటగాడు అవుతాడు కాబట్టి.. ఐపీఎల్ జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం అవుతుందని మరికొందరు తమ కామెంట్లను పెట్టారు.