టెస్ట్ క్రికెట్ లో ఆఫ్ఘానిస్థాన్ సరికొత్త రికార్డ్

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:20 PM

పసికూన ఆఫ్ఘానిస్థాన్ జట్టు తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకుంది. ఆడిన రెండో టెస్ట్ లోనే గెలుపొందిన జట్టుగా ఈ ఘనత సాధించింది. ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 147 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై గెలుపొందింది. లక్ష్య ఛేదనలో రహ్మత్ (76), జనత్ (65 నాటౌట్) రాణించగా అఫ్గాన్ అలవోకగా […]

టెస్ట్ క్రికెట్ లో ఆఫ్ఘానిస్థాన్ సరికొత్త రికార్డ్
Follow us on

పసికూన ఆఫ్ఘానిస్థాన్ జట్టు తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకుంది. ఆడిన రెండో టెస్ట్ లోనే గెలుపొందిన జట్టుగా ఈ ఘనత సాధించింది. ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 147 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై గెలుపొందింది. లక్ష్య ఛేదనలో రహ్మత్ (76), జనత్ (65 నాటౌట్) రాణించగా అఫ్గాన్ అలవోకగా విజయం సాధించింది. అంతకముందు భారత్ తో తమ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడి.. ఓడిన అఫ్గాన్.. తాజాగా ఐర్లాండ్ తో టెస్ట్ లో సమిష్టి ప్రదర్శన తో సత్తాచాటింది. రెండు ఇన్నింగ్స్ లోనూ సత్తాచాటిన రహ్మత్ షా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.

ఇక అటు ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆండ్రూ బాల్ బిర్నీ (82), కెవిన్ ఓబ్రైన్ (56) చెలరేగడంతో 288 పరుగులు చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసిన సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి ఐర్లాండ్ ను కట్టడి చేశాడు.

స్కోర్స్ వివరాలు: ఐర్లాండ్: 172, 288 , ఆఫ్ఘానిస్థాన్: 314, 149/3 (47.5 ఓవర్లు)