ప్రముఖ న్యూట్రిషియన్, వెల్‌నెస్ కంపెనీ అయిన.. హెర్బాలైప్ సంస్థ కస్టమర్లను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. భారత్‌లో తమ ప్రొడక్ట్స్‌ను అధీకృత హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ల నుంచి మాత్రమే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తెలిపింది. ఈ విషయమై కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. తమ ఉత్పత్తులకు సంబంధించి అనధికారిక విక్రయాలు, తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది.
అసలైన హెర్భాలైఫ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఏకైక మార్గం తన ఇండిపెండెండ్ అసోసియేట్స్ నెట్ వర్క్ ద్వారా మాత్రమేనని కంపెనీ పునరుద్ఘాటించింది. హెర్బాలైఫ్ ప్రొడక్ట్స్ భారత్‌తో పాటు 94 దేశాల్లో సంస్థ ఇండిపెండెంట్ అసోసియేట్స్ నెట్ వర్క్ ద్వారా మాత్రమే లభ్యమవుతాయి. వినియోగదారులు అసలైన ప్రొడక్ట్స్‌ను పొందేందుకు ఇండిపెండెంట్ అసోసియేట్స్ నెట్ వర్క్ ద్వారా అందించడమే తమ ఏకైక ఉద్దేశమని కంపెనీ చెబుతోంది.
అందుకే హెర్బాలైఫ్ పేరుతో ఉన్న ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రొడక్ట్స్‌పై “హెర్బాలైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్” అని, హెర్బాలైఫ్ అడ్రస్ ఉన్నా, అసలైన ప్రొడక్ట్స్‌ను పోలి ఉన్నా, అలాగే వెబ్‌సైట్ సరిగ్గా ఉన్నా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కంపెనీ చెబుతోంది. తప్పుదోవ పట్టించే సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కంపెనీ చెబుతోంది. ఇతర ఇ-కామర్స్ సైట్స్‌లో ఇచ్చే సమాచారం, వాటి ద్వారా విక్రయించే ప్రొడక్ట్స్ ప్రామాణికతకు హెర్బాలైఫ్ ఇండియా బాధ్యత వహించదు” అని ప్రకటనలో తెలిపారు.
హెర్భాలైఫ్ ప్రముఖ న్యూట్రిషియన్, వెల్‌నెస్ కంపెనీ. దీనిని 1980లో ప్రారంభించారు. ప్రజలకు పోషకాహార ఉత్పత్తులను అందజేయాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. అలాగే ఈ సంస్థ తన ఇండిపెండెంట్ పంపిణీదారుల కోసం వ్యాపార అవకాశాలను అందిస్తోంది. కంపెనీ ఔత్సాహిక పంపిణీదారుల ద్వారా సుమారు 95కిపైగా రకాల ప్రొడక్ట్స్‌ను అంఇదస్తోంది. పంపిణీదారులకు శిక్షణ ఇచ్చి మరీ సేవలు అందిస్తున్నారు. ప్రజలకు మెరుగైన జీవన శైలి అందించే క్రమంలో తీసుకొచ్చిన ఈ ప్రొడక్ట్స్‌కు మంచి ఆదరణ ఉంది.