Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవ ఏర్పాట్లు, స్వామి, అమ్మవార్ల ఆనందవిహారానికి సర్వం సిద్ధం

|

Mar 23, 2021 | 9:36 PM

Tirumala : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన తెప్పోత్సవాల్లో..

Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవ ఏర్పాట్లు, స్వామి, అమ్మవార్ల ఆనందవిహారానికి సర్వం సిద్ధం
Teppotsavam
Follow us on

Tirumala : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.  రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే తెప్పోత్సవాల్లో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. వాహనాన్ని విద్యుద్దీపాలతో స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్పచుట్టూ నీటిజల్లులు పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం రోజుకు 500కిలోల పుష్పాలను వినియోగిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మల్లెపూల మాలలతో అలంకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

శ్రీవారు తనకిష్టమైన పుష్కరిణిలో సుఖాశీనులై విహరించడాన్ని తెప్పోత్సవం అంటారు. ప్రాచీన కాలం నుండి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. సాళువ నరసింహరాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఇక 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. పున్నమిరోజుల వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో స్వామివారిని ఊరేగించే తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఇవాళ సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి , రేపు రుక్ష్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాఢవీదుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.

మరోవైపు తెప్పోత్సవాల కారణంగా రేపు, ఎల్లుండి జరిగే సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేశారు. ఇక 26,27,28 తేదీల్లో జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు, సహస్రదీపాలంకరణ సేవలను కూడా టిటిడి రద్దు చేసింది. మొత్తానికి శ్రీనివాసుడి ఆలయం బయట జరిగే అతిపెద్ద ఉత్సవం కావడంతో భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రతియేటా పాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశనినాడు మొదలై..పౌర్ణమి వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయి.

Salakatla Teppotsavam 3

Read also : AP CM Review on Visakha Projects : విశాఖ మెట్రో రీజియన్, ట్రాం, మెట్రో రైల్, బీచ్ కారిడార్లపై సీఎం కీలక సూచనలు