అయ్యప్ప భక్తులకు అలర్ట్.. స్వామి దర్శనానికి 10 గంటల సమయం!

శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక మండల యాత్ర ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 8 నుంచి 10 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ పరిమితులు విధించినప్పటికీ భక్తుల తాకిడి కొనసాగుతోంది. డిసెంబర్ 27న మండల పూజ, జనవరి 14న మకర విళక్కు ఉత్సవం నిర్వహించనున్నారు.

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. స్వామి దర్శనానికి 10 గంటల సమయం!
Ayyappa Mandala Pooja

Updated on: Nov 17, 2026 | 8:19 AM

స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. అయ్యప్ప వార్షిక మండల యాత్ర కోసం భక్తులు పోటెత్తారు. ఇవాళ యాత్ర సీజన్‌ తెల్లవారుజామున 3 గంటలకు లాంఛనంగా ప్రారంభం అయింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి దర్శనానికి 8నుంచి 10గంటల సమయం పడుతుంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్చువల్ క్యూ ద్వారా రోజుకు 70 వేల మందికి అనుమతి ఉంది. స్పాట్ బుకింగ్‌ను 20 వేల మందికి పరిమితం చేశారు. అయితే బుకింగ్స్ లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం, టికెట్స్‌ బుక్‌ చేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడే సన్నిధికి చేరుకోవడంతో రద్దీ నియంత్రణ కష్టంగా మారింది.

నీలక్కల్ దగ్గర వాహనాల రాకపోకలను కట్టుదిట్టం చేశారు. పంబ – నీలక్కల్ మధ్య KSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌, పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్సుల్లో తాగునీరు, ఆహార వసతులు కల్పించారు.

డిసెంబరు 27న మండల పూజ చేస్తారు. అదే రోజు ఆలయాన్ని మూసివేసి.. మకర విళక్కు యాత్ర సీజన్‌ కోసం డిసెంబరు 30న తిరిగి తెరుస్తారు. మకర విళక్కు ఉత్సవాన్ని జనవరి 14న నిర్వహిస్తారు. జనవరి 30న ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us