రేపే గణేష్ నిమజ్జనోత్సవం

| Edited By:

Aug 31, 2020 | 4:49 PM

గణేష్‌ నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం ముస్తాబైంది. ట్యాంక్‌ బండ్‌ చుట్టూ జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 5 గంటలలోపే గణేష్‌ పూజను ప్రారంభించి ...సాయంత్రం ఐదు గంటలలోపు నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి రథయాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రేపే గణేష్ నిమజ్జనోత్సవం
Follow us on

గణేష్‌ నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం ముస్తాబైంది. ట్యాంక్‌ బండ్‌ చుట్టూ జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ఈ సారి లక్షకుపైగా మండపాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇంకా 50 వేలకుపైగా జంటనగరాల్లో వినాయక విగ్రహాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఉదయం 5 గంటలలోపే గణేష్‌ పూజను ప్రారంభించి …సాయంత్రం నాలుగు, ఐదు గంటలలోపు నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి రథయాత్ర ఏర్పాట్లు జరుపుతామన్నారు.

గతేడాది వరకూ ఆకట్టుకునే విధంగా గణేష్‌ నిమజ్జనాలు జరిగేవి. కానీ కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని వినాయక నిమజ్జనోత్సవాలు జరుపుతున్నామని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవకమిటీ సభ్యులు తెలిపారు. పోలీసుల సహకారంతో జాగ్రత్తగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించి తీరుతామన్నారు.

ప్రసిద్దిగాంచిన బాలాపూర్‌ వినాయకుడి రథయాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్‌ వినాయకుడి పూజ అనంతరం నిమజ్జనానికి బయలుదేరతారని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవకమిటీ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్‌లో రేపు గమేశ్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు అధికారులు. నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్యాంక్ బండ్ వైపు వినాయకుడి నిమజ్జనానికి వచ్చే వాహనాలు తప్పా మరే వాహనాలను అనుమతించరు. 15 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్‌ను గుర్తుంచుకోవాలన్న సీపీ అంజనీ కుమార్.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఏదైన సమస్య ఉంటే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ఇప్పటి వరకు 30 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా.. 21 క్రేన్లను ఇందుకోసం ఏర్పాటు చేశారు.