Ram Temple Trust: అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ.. మొద‌ట రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి, ప్రధాని నుంచి సేకరణ

|

Jan 15, 2021 | 11:25 AM

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక సాకారం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణను రామజన్మ భూమి ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్ ఈరోజు నుంచి ప్రారంభించనున్నాయి...

Ram Temple Trust:  అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ..  మొద‌ట రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి, ప్రధాని నుంచి సేకరణ
Follow us on

Ram Temple Trust: భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక సాకారం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణను రామజన్మ భూమి ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్ ఈరోజు నుంచి ప్రారంభించనున్నాయి. మొద‌ట రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నుంచి విరాళాలు సేక‌రించ‌నున్నారు. రాష్ట్రపతిని ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్‌గిరి మ‌హారాజ్, వీహెచ్‌పీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు అలోక్ కుమార్ క‌ల‌వ‌నున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలనుంచి స్వామి చినజీయర్‌ విరాళం రూ. 12, 34,567, గోకరాజు గంగరాజు కోటి రూపాయలను ప్రకటించారు.

ఇటీవ‌లి కాలంలో రాష్ట్ర‌ప‌తి నుంచి విరాళాలు సేక‌రించ‌డం ఇదే తొలిసారి. ఈ విరాళ సేకరణ ఫిబ్ర‌వ‌రి 27 వ‌ర‌కు కొనసాగనుంది. రూ.20000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చే వారు పాన్ కార్డు చూపించాలి. చెక్ రూపంలో ఇవ్వాలనే నిబంధన ఉంది. 20 వేల కంటే తక్కువ నగదును విరాళంగా ఇచ్చేవారి నుంచి మాత్రమే డబ్బు రూపంలో తీసుకోనున్నారు. అలాగే, విరాళాల్లో విదేశీ నిధుల‌కు ఆస్కారం లేకుండా ట్రస్ట్ చూసుకుంటోంది.

Also Read: కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి .. అతివేగమే ప్రమాదానికి కారణమా..!