Badrinath: బద్రీనాథ్‌లో పండుగ వాతావరణం.. జోరుగా పవిత్ర ఛార్‌థామ్‌ యాత్ర

|

May 12, 2024 | 5:19 PM

చార్‌థామ్‌ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కేదార్‌నాథ్‌ ఆలయం శుక్రవారం తెర్చుకోగా .. బద్రీనాథ్‌ ఆలయం ఆదివారం తెర్చుకుంది. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఇప్పటివరకు 29 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

Badrinath: బద్రీనాథ్‌లో పండుగ వాతావరణం.. జోరుగా పవిత్ర ఛార్‌థామ్‌ యాత్ర
Shri Badrinath Temple
Follow us on

పవిత్ర ఛార్‌థామ్‌ యాత్ర జోరుగా కొనసాగుతోంది. మంచుకొండల్లో నెలకొన్న పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కేదార్‌నాథ్‌ ఆలయం శుక్రవారమే తెర్చుకుంది. ఇప్పటివరకు 29 వేల మంది భక్తులు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. బద్రినాథ్‌ ఆలయం కూడా ఆదివారం భక్తుల కోసం తెర్చుకుంది. శీతాకాలంలో మూసివేసిన ఈ ఆలయాన్ని చార్‌ ధామ్‌ యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు.

బద్రీనాథ్‌లో పండుగ వాతావరణం కన్పించింది. ఎక్కడ చూసినా భక్తుల సందడే కనపడింది. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 6 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను తెరిచారు. భారత సైన్యంలోని గ్రెనేడియర్‌ రెజిమెంట్‌ బ్యాండ్‌ భక్తి గీతాలను ఆలపించింది. భారీగా తరలివచ్చిన భక్తులు ‘బద్రీ విశాల్ లాల్ కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైంది. కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు.

బద్రీనాథ్‌ పవిత్రక్షేత్రం అలకనంద నది ఒడ్డున ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం శీతాకాలం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. విష్ణువు ఈ ఆలయంలో బద్రీనాథుడిగా కొలువై ఉన్నారు. ఛార్‌థామ్‌ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో ఉత్తరాఖండ్‌ లోని హైవేలన్నీ వేలాదివాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

ఛార్‌థామ్‌ క్షేత్రాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయినప్పటికి భక్తులు ఉత్సాహంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. మరోవైపు కేదార్‌నాథ్‌ ఆలయానికి వరుసగా మూడో రోజులు భక్తులు పోటెత్తారు.. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుంచి 22 కి.మీ ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్‌నాథ్‌ ఆలయం చేరుకుంటున్నారు. మరికొంతమంది కొందరు కాలినడకన దర్శించుకుంటున్నారు. కాలినడకన వెళ్తే దాదాపు 16 కిలో మీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. కేదార్‌నాథ్‌కు కేంద్రం హెలికాప్టర్‌ సేవలను కూడా ఏర్పాటు చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..