Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ముకేశ్ అంబానీ ఇంట కరెంట్ వెలుగులు ఎలా.?

Mukesh Ambani House Antilia Gets Electricity Like This, ముకేశ్ అంబానీ ఇంట కరెంట్ వెలుగులు ఎలా.?

భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. అంతేకాక ఆయన వెర్సిటాలిటీకి మారుపేరు. రోజూ ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి నివసించే భవంతి వరకు అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. దక్షిణ ముంబై ప్రాంతంలోని ఆంటీలియా అనే ఇంద్రభవనంలో ఆయన నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 27 అంతస్తుల ప్యాలెస్‌లో దాదాపు 600 మంది పనివాళ్ళు ఉన్నారు. అంబానీ తన ఇంట్లోని ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని.. అంతేకాక ఒక సిస్టమేటిక్‌గా పని చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.

అసలే అదొక ఇంద్రభవనం.. ఆపై చాలామంది అందులో ఉంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే అధిక మోతాదులో వ్యర్ధాలు ఉండిపోతాయి. ఇక ఈ వ్యర్ధాలను తొలగించడానికి అంబానీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారట. ఈ చెత్తనంతా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారని సమాచారం. తడి, పొడి చెత్తలను రెండు కూడా వేరు చేస్తారట. తడి చెత్తనంతా తీసి డంప్ చేసి.. పొడి చెత్తను కరెంట్ కోసం వాడతారని తెలుస్తోంది.

మరోవైపు ఈ మహాభవంతి పైనే.. హెలికాఫ్టర్లు ల్యాండ్ కావడానికి అనువుగా మూడు హెలిప్యాడ్స్ ఉన్నాయి. అంతేకాక అక్కడ దాదాపు 168 కార్లు పార్కింగ్ చేసుకోగలిగే చోటు కూడా ఉంటుంది. ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే.. స్పా రూమ్, డ్యాన్సింగ్ స్టూడియో, థియేటర్ రూమ్, ప్లే రూమ్, టెర్రాస్ గార్డెన్స్, దేవాలయంతో పాటుగా ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

నవంబర్ 2014 ప్రకారం ఈ భవంతి దాదాపు $2 బిలియన్స్ రేటు ఉంటుందని అంచనా. అంతేకాకుండా భారీ భూకంపాలను కూడా ఈ భవనం తట్టుకోగలిగేలా రూపొందించారట. ఇది ప్రపంచంలోనే రెండో విలువైన రెసిడెన్షియల్ భవంతి.. మొదటి స్థానంలో ఇంగ్లాండ్ బక్‌కింగమ్ ప్యాలస్ ఉంది.