‘చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు ఉండవు.. విలువ‌లనే పునాదులపై వెల‌సిన పార్టీ’

చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు మాకుండవన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు ఉండవు.. విలువ‌లనే పునాదులపై వెల‌సిన పార్టీ
Ysrcp

Updated on: Aug 14, 2021 | 6:06 PM

Vijayasai Reddy – YSRCP: చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు మాకుండవన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విలువ‌లనే పునాదులపై వెల‌సిన పార్టీ మాది అంటూ చెప్పుకొచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ చీకటి స్నేహాలు ఉండవని తేల్చి చెప్పారు.

ఒక వేళ ఏ పార్టీతోనైనా నిజంగా కలిసి పనిచేయాల్సి వస్తే మా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ప్రకటిస్తారని విజయసాయి వెల్లడించారు. చంద్రబాబులా అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకోవడాలు, చాటు మాటు స్నేహాలు, రహస్య సంసారాలు మాకుండవు. విలువల పునాదిపై వెలిసిన పార్టీ మాది అంటూ సాయి ట్వీట్ చేశారు.

‘అను’కుల’కోటను దాటి ఎల్లో మీడియా ఆలోచించలేకపోతోంది’ అని వ్యాఖ్యానించిన ఆయన, రాష్ట్ర ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ‌పై ఎల్లో మీడియా విషం క‌క్కుతోంద‌ని చెప్పుకొచ్చారు. బావిలో కప్పల్లా పచ్చమీడియా పైత్యం చూపించుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కానీలాంటిదని యూకే హై కమిషనర్ ఫ్లెమింగ్ చెప్పారని విజయసాయి గుర్తు చేసుకున్నారు. అవకాశాలు మెండు, పెట్టుబడులకు అనుకూలం. రాజధానికి, నివాసయోగ్యానికి అనుకూలమైన నగరం మన విశాఖ అంటూ విజ‌య‌సాయి మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read also: Ganja Gang War: గంజాయి గ్యాంగ్ వార్: కత్తులు, బండరాళ్లతో గల్లీలో కొట్టుకున్న ముఠా.. ఒకరు మ‌ృతి

Follow Us