వైసీపీలోకి రావాలనుకునే వారికి జగన్ డెడ్‌లైన్

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:24 PM

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పక్కా ప్రణాళికను వేసుకున్నారు. ఇటు తన పార్టీలో ఉండే వారిని నొప్పించకుండా.. అటు తమ పార్టీలోకి వచ్చే వారిని నిరూత్సాహపరచకుండా ఉండేందుకు ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీటు కావాలనుకొని తన పార్టీలోకి రావాలనుకుంటున్న ఫిరాయింపుదారులకు జగన్ డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20 తరువాత తన పార్టీలో చేరబోయే వారికి రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని జగన్ స్పష్టం […]

వైసీపీలోకి రావాలనుకునే వారికి జగన్ డెడ్‌లైన్
Follow us on

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పక్కా ప్రణాళికను వేసుకున్నారు. ఇటు తన పార్టీలో ఉండే వారిని నొప్పించకుండా.. అటు తమ పార్టీలోకి వచ్చే వారిని నిరూత్సాహపరచకుండా ఉండేందుకు ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీటు కావాలనుకొని తన పార్టీలోకి రావాలనుకుంటున్న ఫిరాయింపుదారులకు జగన్ డెడ్‌లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20 తరువాత తన పార్టీలో చేరబోయే వారికి రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని జగన్ స్పష్టం చేశారట. దీంతో ఆ లోపే వైసీపీలో చేరాలని కొందరు ఆశావాహులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ నెల 20 తరువాత జగన్ లండన్‌కు వెళ్లనున్నారు. అక్కడ తన పెద్ద కుమార్తె వర్షా రెడ్డితో గడపనున్న జగన్.. ఐదారు రోజుల తరువాత రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఆ తరువాత ఎన్నికల పనుల్లో పూర్తిగా మునిగిపోనున్న జగన్.. ముందుగా అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 20తరువాత వచ్చే ఫిరాయింపుదారులకు సీటు ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారట. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి దాదాపు 20మంది వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.