1 year for Jagan Ane Nenu: జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలివే..!

| Edited By:

May 30, 2020 | 10:06 AM

''నేను విన్నాను.. నేను ఉన్నాను'' అన్న నినాదంతో గతేడాది మే 23న 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సీఎంగా

1 year for Jagan Ane Nenu: జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలివే..!
Follow us on

”నేను విన్నాను.. నేను ఉన్నాను” అన్న నినాదంతో గతేడాది మే 23న 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది అవుతోంది. మే 30న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అశేష అభిమానుల మధ్య ప్రమాణ స్వీకారం చేసిన జగన్, నవ్యాంద్రప్రదేశ్‌ రెండో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మేనిఫెస్టోను అమలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకున్న జగన్.. ఒక్క ఏడాదిలోనే 90శాతం హామీలను నెరవేర్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్‌తో పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు జగన్.

ఏడాదిలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు:
ఏడాదిలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలు:
1.పేద విద్యార్థుల కోసం జగనన్న అమ్మ ఒడి.
2.రైతన్నను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా.
3.పేద వారికి వైద్యం అందించే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ.
4.ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా గ్రామ/ వార్డు సచివాలయాలు.
5.పేద విద్యార్థులకు భోజనం, వసతి కల్పించేలా జగనన్న వసతి దీవెన.
6.దశలవారీగా మద్యం నియంత్రణ.
7.పేదలందరికీ ఇళ్లు ఇచ్చే క్రమంలో వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ.
8.పొదుపు సంఘాల మహిళల కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.
9. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం.
10. ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం.
11. పోలీసులకు వీక్లీ ఆఫ్‌.
12. మత్య్సకారుల కోసం వైఎస్సార్ మత్య్సకార భరోసా.
13. వృద్ధులు, వికలాంగులకు వైఎస్సార్ పెన్షన్ కానుక.
14. మహిళల రక్షణ కోసం దిశ చట్టం.
15. విద్యార్థుల కోసం నాడు నేడు.
16.మహిళలకు 50 శాతం రిజర్వేషన్.
17. ప్రాజెక్ట్‌ల్లో రివర్స్ టెండరింగ్.
18. స్పందన కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారం.
19.పెట్టుబడుల పెట్టే వారి కోసం వైఎస్సార్ నవోదయం.
20.రాష్ట్రంలో సీబీఐకి అనుమతి.
21.దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పన.
22.సంక్షేమ పథకాల నిర్వహణ కోసం జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు.
23. అర్చకులు,ఇమామ్ లు, పాస్టర్లకు రూ.5వేల ఆర్థిక సాయం.

Read This Story Also: మోదీ విజయాన్ని ముందే ఊహించిన జ్యోతిష్కుడు కన్నుమూత..!