జగన్ తగ్గకపోతే.. ఏపీలో రాష్ట్రపతి పాలనే : యనమల వార్నింగ్

|

Jul 20, 2019 | 8:01 AM

పీపీఏల విషయంలో రివ్యూలపై జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి  పాలన విధించేందుకు అవకాశం ఉందంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు.కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి కేంద్రం ఎందుకు ఆ సూచన చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. పీపీఏ వ్యవహారంతో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. కానీ పీపీఏల విషయంలో జగన్ సర్కార్ అస్సలు తగ్గడం లేదు. […]

జగన్ తగ్గకపోతే.. ఏపీలో రాష్ట్రపతి పాలనే : యనమల వార్నింగ్
Follow us on

పీపీఏల విషయంలో రివ్యూలపై జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి  పాలన విధించేందుకు అవకాశం ఉందంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు.కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి కేంద్రం ఎందుకు ఆ సూచన చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. పీపీఏ వ్యవహారంతో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు.

కానీ పీపీఏల విషయంలో జగన్ సర్కార్ అస్సలు తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారం అధికమైనప్పుడు.. కేంద్రం కూడా గతంలో పీపీఏలను సవరించుకుందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి తామూ అలాగే ముందుకెళ్తామని.. గతంలో జరిగిన పీపీఏలను సవరిస్తామని చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారంతో డిస్కం సంస్థల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని.. కాబట్టి సమీక్ష తప్పదని చెబుతున్నారు.