గవర్నర్ నోట ఆ మాట ఎందుకొచ్చింది..?

| Edited By: Srinu

Aug 31, 2019 | 4:08 PM

గవర్నర్ నరసింహన్ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తి. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు నరసింహన్ సమస్యలను తనదైన శైలీలో పరిష్కరిస్తూ వస్తున్నారు. ఆయన మాటే శాసనం. కనుసైగతోనే పాలన సాగించగలరు. అయితే ఇప్పడు గవర్నర్ చేసిన ఓ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. విశ్వవేదికపై తెలుగువాళ్ల ప్రతిభను చాటిన పీవీ సింధు, మానసిలను రాజ్ భవన్ లో గవర్నర్ సన్మానించారు. ఈ సందర్భంగా పీవీ సింధు 2020లో ఒలంపిక్స్ లో విజేతగా […]

గవర్నర్ నోట ఆ మాట ఎందుకొచ్చింది..?
Follow us on

గవర్నర్ నరసింహన్ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తి. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు నరసింహన్ సమస్యలను తనదైన శైలీలో పరిష్కరిస్తూ వస్తున్నారు. ఆయన మాటే శాసనం. కనుసైగతోనే పాలన సాగించగలరు. అయితే ఇప్పడు గవర్నర్ చేసిన ఓ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.

విశ్వవేదికపై తెలుగువాళ్ల ప్రతిభను చాటిన పీవీ సింధు, మానసిలను రాజ్ భవన్ లో గవర్నర్ సన్మానించారు. ఈ సందర్భంగా పీవీ సింధు 2020లో ఒలంపిక్స్ లో విజేతగా నిలవాలని ఆక్షాంక్షించారు. ఇలా కోరుకోవడమే కాకుండా తాను ఉన్నా లేకున్నా ఇక్కడే అభినందన కార్యక్రమం నిర్వహించాలని చెప్పడమే గవర్నర్ మార్పుపై ఊహగానాలకు రెక్కాలొచ్చేలా చేశాయి.

మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా ఉండగా..ఇటీవలే ఏపీకి విశ్వభూషన్ హరిచందన్ ను కొత్త గవర్నర్ గా నియమించారు. అదే సమయంలో నరసింహన్ మార్పు కూడా జరుగుతుందనే ప్రచారం జరిగింది కాని అలా జరగలేదు. నరసింహన్ నే కేంద్రం కొనసాగించింది.

అయితే త్వరలోనే కేంద్రం నరసింహన్ పదవికాలంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో మరో ఐదు రాష్ట్రాల గవర్నర్ల పదవి కాలం కూడా ముగుస్తోంది. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించి..నరసింహన్ ను జమ్ముకశ్మీర్ కు లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా పంపాలనే ఆలోచలో ఉందట కేంద్రం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్న కేంద్రం..గతంలో ఐపీఎస్ గా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన సందర్భంలో నరసింహన్ వ్యవహరించిన తీరుతో ఆయననే కశ్మీర్ కు పంపే యోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది.