వైసీపీ వైపు అఖిల ప్రియ చూపు.. జగన్ అన్న కరుణిస్తాడా..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 12, 2019 | 4:44 PM

టీడీపీలో ఉండాలనిపించడం లేదట. ఇష్టంగా ఉన్న వైసీపీలో ఎంట్రీ కష్టంగా ఉందట. పెద్దగా పట్టించుకోని బీజేపీ తెగ పిలుస్తోందట. మరి అఖిల ప్రియ దారెటు..? కర్నూల్ జిల్లా పాలిటిక్స్‌లో ఆ మాటకొస్తే సీమ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడా పార్టీని లీడ్ చేస్తోంది మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసినప్పుడు నాన్న భూమా నాగిరెడ్డి అండగా ఉన్నారు. ఆ తరువాత నాగిరెడ్డి మరణం తరువాత […]

వైసీపీ వైపు అఖిల ప్రియ చూపు.. జగన్ అన్న కరుణిస్తాడా..!
Follow us on

టీడీపీలో ఉండాలనిపించడం లేదట. ఇష్టంగా ఉన్న వైసీపీలో ఎంట్రీ కష్టంగా ఉందట. పెద్దగా పట్టించుకోని బీజేపీ తెగ పిలుస్తోందట. మరి అఖిల ప్రియ దారెటు..?

కర్నూల్ జిల్లా పాలిటిక్స్‌లో ఆ మాటకొస్తే సీమ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడా పార్టీని లీడ్ చేస్తోంది మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసినప్పుడు నాన్న భూమా నాగిరెడ్డి అండగా ఉన్నారు. ఆ తరువాత నాగిరెడ్డి మరణం తరువాత పదవి భరోసాగా నిలిచింది. కానీ ఇప్పుడు తండ్రి లేదు. పార్టీ పవర్‌లో లేదు కాబట్టి పదవీ లేదు. దీంతో ఒక్కసారిగా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీలో కొనసాగేందుకు అఖిల ప్రియ ఏ మాత్రం ఆసక్తిగా లేదట. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైసీపీ వైపు చూస్తూనే ఉన్నారట. సొంత గూటికి వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారట. చివరకు జగన్ తల్లి విజయమ్మతో టచ్‌లోకి వెళ్లేందుకు తెగ ట్రై చేశారట. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయినట్లే అయ్యి అక్కడితోనే ఆగిపోయాయట. జగన్ అన్నను క్షమాపణ అడిగేసి పొలిటికల్‌గా కాస్త బూస్టప్ అవుదాం అనుకున్న ఆశలు అడియాశలు అయిపోయాయట.

మరోవైపు తమ చిరకాల ప్రత్యర్థి గంగుల కుటుంబం వైసీపీలో ఉండగా.. భూమా అఖిల ప్రియ ఎంట్రీకి వారు ఏ మాత్రం అంగీకరించరని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ మారొద్దని టీడీపీ బుజ్జగింపులు చేస్తోందట. ఈ మధ్యలో బీజేపీ మాత్రం తనను రమ్మని పిలుస్తోందట. మరి భూమా అఖిల ప్రియ పొలిటికల్ కెరీర్ ఎలా ఉండనుందో ఆ పెరుమాల్‌కే తెలియాలి.