ఇక నందిగ్రామ్ లో ఇద్దరం తేల్చుకుందాం, బెంగాల్ సీఎం మమతకి సువెందు అధికారి సవాల్

| Edited By: Anil kumar poka

Mar 06, 2021 | 7:53 PM

బెంగాల్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ దిగ్గజాల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నానని,  ఈ పోటీకి సిధ్దంగా ఉండాలని బీజేపీ నేత సువెందు అధికారి సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు.

ఇక నందిగ్రామ్ లో ఇద్దరం తేల్చుకుందాం, బెంగాల్ సీఎం మమతకి సువెందు అధికారి సవాల్
Follow us on

బెంగాల్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ దిగ్గజాల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నానని,  ఈ పోటీకి సిధ్దంగా ఉండాలని బీజేపీ నేత సువెందు అధికారి సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈయన.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి విదితమే. బెంగాల్ ఎన్నికలకు ఈ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి  జాబితాలో నందిగ్రామ్ నుంచి తమ క్యాండిడేట్ గా సువెందు పోటీ చేస్తారని స్పష్టం చేసింది. మొత్తం 57 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ప్రకటించింది. తను భవానీపూర్ సీటును ఖాళీ చేస్తున్నానని, నందిగ్రామ్ స్థానాన్ని ఎంచుకున్నానని మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో సువెందు అధికారి శనివారం ఆమెకు ఈ సవాల్ విసిరారు. ఎన్నికలరణ క్షేత్రంలో ఇక పోరాడుదాం అన్నారు. (భవానీపూర్ లో తన బదులు శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ పోటీ చేస్తారని మమత వెల్లడించారు).

మమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యతతో ఓడిస్తానని సువెందు అధికారి పునరుద్టాటించారు.. మీరిక ఈ సీటును వదలడం, వెళ్లిపోవడం ఖాయమని ఆయన అన్నారు. మే 2 న ప్రజలు ఇచ్చే తీర్పు కోసం వేచి ఉండండి అన్నారు. మిడ్నపూర్ కొడుకును తాము కోరుతున్నామని, బయటవారిని కాదని ఆయన పేర్కొన్నారు. మీ ఓటమి ఖాయం అని పదేపదే వ్యాఖ్యానించారు. కాగాతాము పోటీ చేసే 291 మంది టీఎంసీ అభ్యర్థుల జాబితాను మమతా బెనర్జీ విడుదల చేశారు. ఇందులో 50 మంది మహిళలు, 29 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలు, 42 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. కొన్ని స్థానాలను ఇతరులకు వదిలివేశామన్నారు. బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అప్పుడే కేంద్రం భారీ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలను పంపుతోంది. బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

అమెరికాలో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి..

సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ ఛార్జ్ షీట్ ‘శుధ్ధ వేస్ట్’, పెదవి విరిచిన రియా లాయర్