బాబు కాకుంటే బండి నడిపేదెవరు ? తెలుగుతమ్ముళ్ళలో జోరుగా చర్చ

| Edited By: Srinu

Nov 20, 2019 | 6:44 PM

చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేవారు ఎవరు? ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చ నడుస్తోంది. కొందరు ఒక నేత పేరు చెబుతుంటే…మరికొందరు ఇంకొకరి పేరు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ఇప్పుడు ఓ స్పెషల్ పేరుపై డిస్కషన్‌ జరగాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ వ్యక్తి పేరేంటి? ఆయన రాకతో టీడీపీకి పునర్వైభవం వస్తుందా? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చకు తెరలేపింది. జూనియర్ ఎన్టీఆర్ అంశం ఇపుడు ఏపీ రాజకీయ వర్గాల్లో, టిడిపిలో చర్చకు దారితీస్తోంది. […]

బాబు కాకుంటే బండి నడిపేదెవరు ? తెలుగుతమ్ముళ్ళలో జోరుగా చర్చ
Follow us on

చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేవారు ఎవరు? ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చ నడుస్తోంది. కొందరు ఒక నేత పేరు చెబుతుంటే…మరికొందరు ఇంకొకరి పేరు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ఇప్పుడు ఓ స్పెషల్ పేరుపై డిస్కషన్‌ జరగాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ వ్యక్తి పేరేంటి? ఆయన రాకతో టీడీపీకి పునర్వైభవం వస్తుందా? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చకు తెరలేపింది.

జూనియర్ ఎన్టీఆర్ అంశం ఇపుడు ఏపీ రాజకీయ వర్గాల్లో, టిడిపిలో చర్చకు దారితీస్తోంది. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తరువాత చంద్రబాబు కాకుంటే పార్టీని నడిపే నాయకుడు ఎవరనే చర్చ మొదలైంది. ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్న నేతలు చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తూ బయటకు వెళుతున్నారు. లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, పార్టీని నడిపించే సామర్థ్యం అతనికి లేదని, పార్టీలో పెద్ద స్పీడ్ బ్రేకర్ లోకేష్ అని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఎందుకు కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, లోకేష్‌కు భయమని… వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారని వంశీ కామెంట్‌ చేశారు. వంశీ కామెంట్లే కాదు. జూనియర్‌ ఎన్టీఆర్ అంశం ఇప్పుడు పార్టీలో అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోంది.. చంద్రబాబు తరువాత పార్టీ పరిస్థితి ఏంటనే డిస్కషన్‌ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని ఒక వర్గం నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

ప్రస్తుతం టీడీపీకి మరికొందరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న టీడీపీకి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై బాహాటంగానే చర్చ సాగుతోంది. కొంతమంది ప్రైవేటు డిస్కషన్‌‌లలో ఈ అంశాన్ని చర్చిస్తున్నారు. కొందరు నేతలు రావాలని అంటే…మరికొందరు మాత్రం ఇప్పుడే అవసరం లేదని వాదిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపేది ఎవరు? అనే డిస్కషన్‌ మాత్రం టీడీపీలో కిందిస్థాయి నుంచి పైస్థాయి నేతల వరకు జరుగుతోంది. మరోవైపు ఈ ప్రచారం, చర్చలు ఏ విధంగా ఉన్నా.. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతారా? అనేది పెద్ద పాయింట్‌. ఈ చర్చపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు..తన అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.