‘సోనార్ బంగ్లా, ప్రగతి శీల్ బంగ్లా’ ‘ఇదే మా నినాదం,’ కోల్ కతాలో ప్రధాని మోదీ ప్రకటన,

| Edited By: Anil kumar poka

Mar 07, 2021 | 4:28 PM

ఈ బెంగాల్ కు ఉజ్వల భవితవ్యం ఉండాలని, సోనార్ బంగ్లా, ప్రగతి శీల్ బంగ్లా కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  ప్రజలు ఇదే కోరుతున్నారని ఆయన చెప్పారు. ఇక్కడ మార్పు అనివార్యమని అన్నారు.

సోనార్ బంగ్లా, ప్రగతి శీల్ బంగ్లా ఇదే మా నినాదం,  కోల్ కతాలో ప్రధాని మోదీ ప్రకటన,
Follow us on

ఈ బెంగాల్ కు ఉజ్వల భవితవ్యం ఉండాలని, సోనార్ బంగ్లా, ప్రగతి శీల్ బంగ్లా కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  ప్రజలు ఇదే కోరుతున్నారని ఆయన చెప్పారు. ఇక్కడ మార్పు అనివార్యమని అన్నారు. ఆదివారం కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. ఈ గ్రౌండ్ ఎంతోమంది మహామహులను చూసిందని, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచిన వ్యక్తులను కూడా చూసిందని, అందువల్లే ఇక్కడ మార్పు రావాలని ప్రజలు అభిలషిస్తున్నారని చెప్పారు. మార్పు తప్పకుండా వస్తుందన్న తమ ఆశలను వారు వీడలేదని అన్నారు. టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలను దుయ్యబట్టిన మోదీ..ఈ పార్టీలు బెంగాల్ వ్యతిరేక పార్టీలన్నారు. ఈ ఎన్నికల్లో ఇవన్నీ ఓ వైపు, ప్రజలు మరో వైపు ఉన్నారన్నారు.   75 ఏళ్ళల్లో ఈ రాష్ట్రంఏం కోల్పోయిందో ప్రజలకు తెలుసునని, అందుకే సంకల్ప బలంతో తామిక్కడికి వచ్చా మన్నారు. ‘జో భీ బెంగాల్ సే చీనాగయా,  వో వాపస్ ఆయేగా  అని ఆయన వ్యాఖ్యానించారు. ‘

రైతులు,  వర్తకులు, మహిళల ప్రయోజనాలకోసమే తామిక్కడికి వచ్చామని,  మీ కలలను, మీ ఆశయాలను  నెరవేర్చేందుకు ప్రతి క్షణం కృషి చేస్తామని, ఆ అవకాశం తమకివ్వాలని మోదీ కోరారు. ఐదేళ్లలో ఇక్కడ జరిగే అభివృద్ధి మరో పాతికేళ్ళకు బాటలు పరుస్తుందని ఆయన చెప్పారు. 2047 నాటికీ ఈ రాష్ట్రం దేశానికే నాయకత్వం వహిస్తుందని, ఆ నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఈ కోల్ కతా సిటీ ఆఫ్ ఫ్యూచర్ అవుతుందని ఆయన అభివర్ణించారు. కేంద్రం ఈ రాష్ట్రానికి విడుదల చేసిన గ్రాంట్లను ఈ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా  సంక్షేమ చర్యలకు వినియోగించకుండా  దాదాపు వృధా చేసిందని మోదీ ఆరోపించారు. అందువల్లే సోనార్ బంగ్లా కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.

ఇలా ఉండగా మోదీ ఈ ర్యాలీల్లో ప్రసంగిస్తుండగా వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ… సిలిగురిలో భారీ ర్యాలీ నిర్వహించారు. సామాన్య గృహిణులకు భారమయ్యే ఈ ధరలను కేంద్రం పెంచుతూ పోతోందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి, తృణమూల్ కాంగ్రెస్ విజయానికి ముఖ్యంగా మహిళలు కృషి చేయాలని  ఆమె పిలుపునిచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

CM MAMATA PROTEST: బెంగల్ రచ్చ ..ఓ వైపు ప్రధాని మోదీ ప్రచార సభ.. మరో వైపు సీఎం మమత నిరసన ర్యాలీ..

Anil Ravipudi : ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేష్ డైరెక్టర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..