ఎంపీ బరిలో నటి ఊర్మిల..?

| Edited By:

Mar 26, 2019 | 12:38 PM

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంగీలా ఊర్మిల మతోండ్కర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు ఆమె పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర ముంబయి సీటు ఊర్మలకు దక్కినట్లుగా ప్రచారం జరగుతోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. కాగా ముంబైలోని ఆరు ఎంపీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఊర్మిలకు సీటు ఖరారు అయితే, సిట్టింగ్ బీజేపీ […]

ఎంపీ బరిలో నటి ఊర్మిల..?
Follow us on

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంగీలా ఊర్మిల మతోండ్కర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు ఆమె పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర ముంబయి సీటు ఊర్మలకు దక్కినట్లుగా ప్రచారం జరగుతోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. కాగా ముంబైలోని ఆరు ఎంపీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఊర్మిలకు సీటు ఖరారు అయితే, సిట్టింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోపాల్ శెట్టిని ఆమె ఎదుర్కోవల్సి ఉంటుంది.