కమలం “ఆకర్ష”లో.. రాజగోపాలుడు..? కాంగ్రెస్ వేటు..?

| Edited By:

Jun 16, 2019 | 11:14 AM

నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీ అధిష్టానంపై గళమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ మారాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వమేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. 2024లోనూ బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు.దీంతో రాజగోపాల్ […]

కమలం ఆకర్షలో.. రాజగోపాలుడు..? కాంగ్రెస్ వేటు..?
Follow us on

నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీ అధిష్టానంపై గళమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ మారాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వమేనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. 2024లోనూ బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు.దీంతో రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీ-పీసీసీ రంగం సిద్ధం చేసింది. తక్షణం నోటీసులు జారీ చేయాలని టీ పీసీసీ క్రమ శిక్షణా సంఘం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ.. బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలనే యోచనలో టీపీసీసీ ఆలోచిస్తోంది. అయితే పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎమ్మెల్యేగా కొనసాగవచ్చని.. వ్యూహాత్మకంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యల సంఘం  రేపు సమావేశమై రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.

కాగా, గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియాపై వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయనపై.. అప్పట్లోనే అధిష్టానం చర్యలు తీసుకోవాలని యోచించినా.. చివరి క్షణంలో వెనక్కి తగ్గింది.