ఈ నెల 24న తెలుగు సీఎంల భేటీ..!

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2019 | 9:39 AM

విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈనెల 24న మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లోనే ఈ సమావేశం జరగొచ్చని సమాచారం. అయితే జగన్ సీఎంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో పలు అంశాలపై అంగీకారం కూడా కుదిరింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య తొమ్మిది, పది […]

ఈ నెల 24న తెలుగు సీఎంల భేటీ..!
Follow us on

విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈనెల 24న మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లోనే ఈ సమావేశం జరగొచ్చని సమాచారం. అయితే జగన్ సీఎంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇప్పటికే మూడు సార్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో పలు అంశాలపై అంగీకారం కూడా కుదిరింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య తొమ్మిది, పది షెడ్యూల్ సంస్థల విభజన, గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలోని నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అలాగే ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. వీటిని త్వరగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న ఇద్దరు సీఎంలూ ఈ మేరకు ఫోన్‌లో మాట్లాడి తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైనా కేసీఆర్‌, జగన్‌లు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ ఇద్దరు సీఎంలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సరైన సహకారం లభించడం లేదు. ఈ భావన రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చించి, కార్యాచరణను నిర్ణయించుకోనున్నట్లు తెలిసింది.