మనవడిని మందలించిన హోంమంత్రి మహమూద్ అలీ

| Edited By: Srinu

Jul 19, 2019 | 12:56 PM

పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని టిక్‌టాక్ వీడియో చేసిన మనవడు ఫర్కాన్ అహ్మద్‌ని.. హోంమంత్రి మహమూద్ అలీ తీవ్రంగా మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా తన మనవడు ప్రవర్తిస్తే.. తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులను నిర్ధేశిస్తూ ట్వీట్‌ చేశారు. హోంమంత్రి ట్వీట్‌కు స్పందించిన పోలీసు యంత్రాంగం.. అది డీజీపీ సార్ వెహికల్ కాదని.. కానీ.. దీనిపై ఇన్వస్టిగేషన్ చేస్తామని.. త్వరలోనే నోటీసులు పంపిస్తామని ట్వీట్‌లో తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం( టీఎస్ 09 […]

మనవడిని మందలించిన హోంమంత్రి మహమూద్ అలీ
Follow us on

పోలీసు శాఖకు చెందిన అధికారిక వాహనంపై కూర్చొని టిక్‌టాక్ వీడియో చేసిన మనవడు ఫర్కాన్ అహ్మద్‌ని.. హోంమంత్రి మహమూద్ అలీ తీవ్రంగా మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా తన మనవడు ప్రవర్తిస్తే.. తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసు ఉన్నతాధికారులను నిర్ధేశిస్తూ ట్వీట్‌ చేశారు.

హోంమంత్రి ట్వీట్‌కు స్పందించిన పోలీసు యంత్రాంగం.. అది డీజీపీ సార్ వెహికల్ కాదని.. కానీ.. దీనిపై ఇన్వస్టిగేషన్ చేస్తామని.. త్వరలోనే నోటీసులు పంపిస్తామని ట్వీట్‌లో తెలిపారు.

ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనం( టీఎస్ 09 పీఏ9999 )పై ఆయన మనవడు పుర్కాన్ అహ్మద్, అతడి స్నేహితుడుతో కలిసి కూర్చొని టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు. సదరు వీడియోలో ఒక బాలివుడ్ సినిమాలో పోలీసు అధికారిని పీక కోస్తామని అత్యంత అవమానకరంగా బెదిరించే ఆడియోకు మ్యాచ్ అయ్యేలా హోంమంత్రి మనవడు, అతడి స్నేహితుడు హావభావాలు వ్యక్తం చేస్తూ టిక్‌టాక్ వీడియో చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.