తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు

| Edited By:

Apr 12, 2019 | 8:32 PM

సార్వత్రిక ఎన్నికల వేళ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నలిచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు […]

తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
Follow us on

సార్వత్రిక ఎన్నికల వేళ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నలిచ్చిన విషయం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. మార్చి 13, 22వ తేదీల్లో రెండు సార్లు ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని ఈసీ అంగీకరించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను లోక్‌సభ ఫలితాలు ప్రకటించేదాకా విడుదల చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.