టీడీపీకి కావాల్సింది షో చేసే వాళ్లు కాదు: కేశినేని నాని

| Edited By:

Jul 09, 2019 | 8:33 AM

సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలపై వరుస పోస్టులతో విరుచుకుపడుతోన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి కావాల్సింది షో చేసే వాళ్లు కాదని.. పరిస్థితులను ఎదుర్కొనేవాళ్లని ఆయన తాజాగా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. కాగా దీనిపై నెటిజన్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తనకు టీడీపీ అధిష్టానం పార్లమెంటరీ విప్‌ పదవిని ఇవ్వడంపై కేశినేని నాని అసంతృప్తిని వ్యక్తం […]

టీడీపీకి కావాల్సింది షో చేసే వాళ్లు కాదు: కేశినేని నాని
Follow us on

సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలపై వరుస పోస్టులతో విరుచుకుపడుతోన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి కావాల్సింది షో చేసే వాళ్లు కాదని.. పరిస్థితులను ఎదుర్కొనేవాళ్లని ఆయన తాజాగా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. కాగా దీనిపై నెటిజన్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తనకు టీడీపీ అధిష్టానం పార్లమెంటరీ విప్‌ పదవిని ఇవ్వడంపై కేశినేని నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు అంత పెద్ద పదవి వద్దని, ఆ బాధ్యతలను తాను మోయలేనంటూ పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి పార్టీకి అంటీముట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు.