నాని పార్టీ మారబోతున్నారా..? అందుకే వరుస ట్వీట్లా..?

| Edited By: Srinu

Jul 17, 2019 | 12:42 PM

ఏపీలో ట్వీట్ల వార్‌ కంటిన్యూ అవుతోంది. నిన్నటి వరకు బుద్ధా వర్సెస్ నానీగా పొలిటికల్ హీట్ పెంచిన ఈవార్ ఇప్పుడు మరింత రాజుకుంటోంది. అధినేత బాబు హెచ్చరికలతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొంత సద్దుమణిగినా.. నాని మాత్రం వరుస ట్వీట్లతో వార్ వన్‌సైడే అంటున్నాడు. ఏపీ టీడీపీ నేతల మధ్య ఇప్పుడు ట్వీట్ల వార్ తారా స్థాయికి చేరింది. నిన్నమొన్నటి వరకు ట్విట్టర్‌ వేదికగా పరస్పర విమర్శలకు దిగిన నేతల వ్యవహారం పసుపు పార్టీలో చిచ్చు […]

నాని పార్టీ మారబోతున్నారా..? అందుకే వరుస ట్వీట్లా..?
Follow us on

ఏపీలో ట్వీట్ల వార్‌ కంటిన్యూ అవుతోంది. నిన్నటి వరకు బుద్ధా వర్సెస్ నానీగా పొలిటికల్ హీట్ పెంచిన ఈవార్ ఇప్పుడు మరింత రాజుకుంటోంది. అధినేత బాబు హెచ్చరికలతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొంత సద్దుమణిగినా.. నాని మాత్రం వరుస ట్వీట్లతో వార్ వన్‌సైడే అంటున్నాడు.

ఏపీ టీడీపీ నేతల మధ్య ఇప్పుడు ట్వీట్ల వార్ తారా స్థాయికి చేరింది. నిన్నమొన్నటి వరకు ట్విట్టర్‌ వేదికగా పరస్పర విమర్శలకు దిగిన నేతల వ్యవహారం పసుపు పార్టీలో చిచ్చు పెట్టింది. అయితే.. ఈ వ్యవహారంలో నువ్వా.. నేనా అన్నట్లు ట్వీట్లతో తిట్టుకున్న నేతలను పార్టీ అధినేత కాస్ల్ పీకి నచ్చజెప్పారు. దీంతో కొంత సద్దుమణిగిందనుకున్న వ్యవహారం ఈ రోజు నాని లేటెస్ట్ ట్వీట్‌తో మరోసారి రాజుకుంది.

సామాజిక సమీకరణలో భాగంగా బుద్ధావెంకన్నకు మద్దతుదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. కేశినేని నాని తన ట్వీట్లను కంటిన్యూ చేస్తున్నారు. టీడీపీ నుంచి బయటకెళ్లాలని నాని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే పార్టీ అధినేత చెప్పినా వినకుండా వరుస ట్వీట్లు చేయడానికి ఇదే కారణమంటున్నారు.