వైసీపీ వైపు తెలుగు తమ్ముళ్ల చూపు..?

|

Jul 21, 2019 | 7:45 PM

ఆయన ఓడిపాయాడు. ఆ పార్టీకి కూడా పవర్ పోయింది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం తనయుడే రాయబారిగా మారిన పరిస్థితి. ఇది తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో అలజడి రేపుతోంది. కాస్త ఫ్యాన్ గాలిలో సేదతీరే అవకాశం ఇస్తే.. సైకిల్ దిగుతా.. అంటూ ఏకంగా జగన్‌కే మేటర్ చేరేశాడు. మరి రాజానగరం మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ కి ఫ్యాన్ గాలి తగులుతుందా? అసలు వెంకటేష్ పార్టీలోకి రావడానికి జక్కంపూడి ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ? ఆపరేషన్ టీడీపీ.. […]

వైసీపీ వైపు తెలుగు తమ్ముళ్ల చూపు..?
Follow us on

ఆయన ఓడిపాయాడు. ఆ పార్టీకి కూడా పవర్ పోయింది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం తనయుడే రాయబారిగా మారిన పరిస్థితి. ఇది తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో అలజడి రేపుతోంది. కాస్త ఫ్యాన్ గాలిలో సేదతీరే అవకాశం ఇస్తే.. సైకిల్ దిగుతా.. అంటూ ఏకంగా జగన్‌కే మేటర్ చేరేశాడు. మరి రాజానగరం మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ కి ఫ్యాన్ గాలి తగులుతుందా? అసలు వెంకటేష్ పార్టీలోకి రావడానికి జక్కంపూడి ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ?

ఆపరేషన్ టీడీపీ.. ఆపరేషన్ ఏపీ అంటూ ఒకవైపు టీడీపీని బీజేపీ కలవరపెడుతుంటే… మరోవైపు తెలుగు తముళ్లు వైసీపీ వైపు ఓ లుక్ వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సైకిల్ దిగే ఆలోచనలో ఉన్నారట. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన వెంకటేష్ హ్యాట్రిక్ కొట్టాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో వెంకటేష్ తన కుమారుడు అభిరామ్‌ను రంగంలోకి దించాడు. సీఎం జగన్‌కు అభిరామ్‌తో విషయం చేరవేశాడు. దీంతో తెలుగుతమ్ముళ్లు వెంకటేష్ పార్టీ వీడటం ఖాయమని నిర్ణయానికి వచ్చేశారు.

అసలు విషయం ఏమిటంటే.. నియోజకవర్గాల పునర్విభజనలో రాజానగరం నియోజకవర్గం రెండుగా విడిపోయో ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపైనే వెంకటేష్ ఆశలు పెట్టుకున్నారట. రాజానగరం కాస్తా.. రెండుగా విడిపోతే.. ఒక వైపు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్నది వెంకటేష్ ప్రధానవ్యూహం.. దీనివల్ల రాజానగరంలో టీడీపీకి ఇబ్బందులు తప్పవని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.