Lokesh: ‘అది ఇంటి గొడ్డలేన‌ని.. సొంతింటి వేట‌ కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్పష్టం అవుతోంది’: నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలకు దిగారు. ఓట్ల కోసం హత్యలు చేయించడం

Lokesh: అది ఇంటి గొడ్డలేన‌ని.. సొంతింటి వేట‌ కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్పష్టం అవుతోంది: నారా లోకేష్
Lokesh

Updated on: Aug 13, 2021 | 6:45 PM

Nara Lokesh – YS Vivekananda Reddy murder case: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలకు దిగారు. ఓట్ల కోసం హత్యలు చేయించడం వైఎస్ కుటుంబానికి కొత్తేం కాదని చెప్పుకొచ్చారు. ఫ్యాక్షన్ వారి బ్లడ్‌లోనే ఉందన్న లోకేష్.. ఓట్ల కోసం సొంత‌ బాబాయ్‌ పైనే గొడ్డలి వేటు వేయించి.. ఆ నెత్తురుని చంద్రబాబు గారికి అంటించాలని చూశారని విమర్శించారు.

నారాసుర‌ ర‌క్త చ‌రిత్ర అంటూ వారి పేపర్లో అదే గొడ్డలి చంద్రబాబుగారి చేతికి గ్రాఫిక్స్‌లో పెట్టి మ‌రీ అచ్చేయించారని ట్విట్టర్లో సదరు కథనాల్ని ప్రస్తావించారు. వారి తరతరాల వైఎస్సాసుర‌ ర‌క్తచ‌రిత్ర అంతా నేరాల‌మ‌యమని మ‌రోసారి సీబీఐ ద‌ర్యాప్తుతో తేట‌తెల్లమైందని లోకేష్ చెప్పుకొచ్చారు.

అరాచ‌కాల‌కు వైఎస్ ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్ అని వ్యాఖ్యానించిన నారా లోకేష్.. దాడులు, దౌర్జన్యాలు, క‌బ్జాల‌పై వారికి పేటెంట్ హ‌క్కులున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా హత్యే అందుకు నిదర్శనమన్నారు. వైఎస్ కుటుంబ‌ స‌భ్యులను ఒక్కొక్కరినీ సీబీఐ పిలుస్తుంటే.. సొంతింటి వేట‌కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌నే విషయం స్పష్టమవుతోందని లోకేష్ అన్నారు.

డ‌బ్బు, ఆధిప‌త్యం, గ‌నులు, అక్రమాల కోసం సొంత బాబాయ్‌నే చంపుకున్న వైఎస్సాసుర కుటుంబ‌ ర‌క్తచ‌రిత్రనీ సదరు పేపర్లో ఎలా అచ్చేస్తావో చూస్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్.

Read also: Stamps and registrations: ఏపీలో చలానాల మార్ఫింగ్ కుంభకోణం: టీవీ9తో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజి శేషగిరి బాబు కామెంట్స్

 

Loading...
Unable to load recommendations.
Follow Us