వీహెచ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారా?

|

Aug 09, 2019 | 5:21 AM

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు పార్టీ సీనియర్ లీడర్ వీహెచ్. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు. పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందులోను ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అవమానం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . ఈ నెల 20న జరగబోయే రాజీవ్ గాంధీ జయంతి రోజు తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వీహెచ్ ప్రటించారు . దీనిపై పార్టీ […]

వీహెచ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారా?
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు పార్టీ సీనియర్ లీడర్ వీహెచ్. వారి వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని వాఖ్యానించారు. పార్టీలోని నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అందులోను ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అవమానం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . ఈ నెల 20న జరగబోయే రాజీవ్ గాంధీ జయంతి రోజు తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వీహెచ్ ప్రటించారు . దీనిపై పార్టీ నేతలపై మరియు కార్యకర్తలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్‌ అడిగితే.. తన పేరు లేకుండానే జాబితా సిద్ధం చేసి ఢిల్లీకి పంపారన్నారు. హైకమాండ్‌లో కొందరు నిజాయతీపరులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీ పట్ల అమితమైన విధేయత కారణంగానే ఆయనకు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చిన వీహెచ్… పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.