ప్రతిపక్షాలతో నా షూ లేస్ విప్పించుకుంటా… : వరుణ్ గాంధీ

| Edited By:

May 05, 2019 | 1:42 PM

యూపీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు వారి నోటికి పనిచెప్పి విమర్శలపాలవుతున్నారు. తాజాగా వరుణ్ గాంధీ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. గతంలో కూడా అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వరుణ్ గాంధీ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో.. తన తల్లి మేనకా గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమది నెహ్రూ- గాంధీ కుటుంబమే అంటూ పరోక్షంగా చెప్పుకున్న ఆయన.. బీఎస్పీ అభ్యర్ధిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. […]

ప్రతిపక్షాలతో నా షూ లేస్ విప్పించుకుంటా... : వరుణ్ గాంధీ
Follow us on

యూపీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు వారి నోటికి పనిచెప్పి విమర్శలపాలవుతున్నారు. తాజాగా వరుణ్ గాంధీ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. గతంలో కూడా అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వరుణ్ గాంధీ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో.. తన తల్లి మేనకా గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమది నెహ్రూ- గాంధీ కుటుంబమే అంటూ పరోక్షంగా చెప్పుకున్న ఆయన.. బీఎస్పీ అభ్యర్ధిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరవ మర్యాదలు పాటించని వాళ్లు శవాలతో సమానమని.. దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఓటర్లతో అన్నారు. అనంతరం మీ కోసం నేను ఉన్నా.. నేను సంజయ్ గాంధీ కుమారుడినని.. వాళ్లతో తన షూ లేస్ విప్పించుకుంటానని బీఎస్పీ నేతలపై పరోక్ష విమర్శలు చేశారు. తన ముందు మాట్లాడే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. ప్రత్యర్ధిని ఉద్దేశించి.. ప్రజలు మోనూ, టోనూలను చూసి భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రసంగించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.