చిన్నారుల మరణాలపై సుప్రీం సీరియస్

| Edited By:

Jun 25, 2019 | 5:10 PM

బీహార్‌లో ఎక్యూట్ ఎన్‌సెఫలైటీస్ వ్యాధితో 163 మంది పిల్లలు మృతి చెందడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, ఆరోగ్య సదుపాయాలు, తదితరాలపై వారం రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని ఖచ్చితంగా సమాధానాలు కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముజఫరాపూర్‌లో పసిపిల్లల మరణానికి కారణమైన మెదడువాపు వ్యాధికి అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని, […]

చిన్నారుల మరణాలపై సుప్రీం సీరియస్
Follow us on

బీహార్‌లో ఎక్యూట్ ఎన్‌సెఫలైటీస్ వ్యాధితో 163 మంది పిల్లలు మృతి చెందడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, ఆరోగ్య సదుపాయాలు, తదితరాలపై వారం రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని ఖచ్చితంగా సమాధానాలు కావాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముజఫరాపూర్‌లో పసిపిల్లల మరణానికి కారణమైన మెదడువాపు వ్యాధికి అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని మనోహర్ ప్రతాప్, ఎస్.అజ్మని ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
చిన్నారులకు వైద్యం అందిస్తున్న హాస్పిటల్లో డాక్టర్లు, మంచాలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లు, వైద్య నిపుణులు అందుబాటులో లేరని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. ఈవ్యాధిని అరికట్టగల సామర్ధ్యం ఉన్నప్పటికి వైద్యుల నిర్లక్ష్యం కారణాంగానే ఇన్ని మరణాలు సంభవించాయని పిటిషనర్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించిన దాఖలాలు కనిపించలేదు.