పృథ్వికి మళ్లీ కౌంటర్!

| Edited By:

Aug 10, 2019 | 2:02 AM

జగన్ ఏపీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి తెలుగు సినిమా జనాలు ఆయనకు కనీస మర్యాద పూర్వకంగా అయినా శుభాకాంక్షలు చెప్పలేదన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇదే విషయాన్ని మీడియాలో ప్రస్తావించడంతో హైలెట్ అయ్యింది. ఇండస్ట్రీకి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రత్యక్షంగానో… పరోక్షంగానే టీడీపీకే సపోర్ట్ చేస్తుంటారు. తాజా ఎన్నికల్లో మాత్రం సినిమా ఇండస్ట్రీలోని పృథ్వి- పోసాని కృష్ణమురళీ- జీవితా రాజశేఖర్ దంపతులతో పాటు మరి కొందరు చిన్నా […]

పృథ్వికి మళ్లీ కౌంటర్!
Follow us on

జగన్ ఏపీ సీఎంగా ఎన్నికైనప్పటి నుంచి తెలుగు సినిమా జనాలు ఆయనకు కనీస మర్యాద పూర్వకంగా అయినా శుభాకాంక్షలు చెప్పలేదన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇదే విషయాన్ని మీడియాలో ప్రస్తావించడంతో హైలెట్ అయ్యింది. ఇండస్ట్రీకి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రత్యక్షంగానో… పరోక్షంగానే టీడీపీకే సపోర్ట్ చేస్తుంటారు. తాజా ఎన్నికల్లో మాత్రం సినిమా ఇండస్ట్రీలోని పృథ్వి- పోసాని కృష్ణమురళీ- జీవితా రాజశేఖర్ దంపతులతో పాటు మరి కొందరు చిన్నా చితకా ఆర్టిస్టులు వైసీపీకి సపోర్ట్ చేశారు.

ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీకి జగన్ కు ఎలాగూ దగ్గర బంధుత్వమే ఉంది. దీంతో మోహన్ బాబు వైసీపీలో చేరి ప్రచారం చేశారు. ఇక జగన్ సీఎం అయ్యాక పృథ్విని ప్రముఖ టీటీడీ భక్తి ఛానెల్ ఎస్వీబీసీకి చైర్మన్ గా చేశారు. అప్పటి నుంచి పృథ్వి ఇండస్ట్రీ పెద్దలను టార్గెట్ చేస్తున్నారు. జగన్ కు ఏపీ ప్రజలు ఏకంగా 151 సీట్లతో ఘనవిజయం కట్టబెట్టి సీఎం చేస్తే ఇండస్ట్రీ పెద్దలు కనీసం మర్యాద పూర్వకంగా కూడా శుభాకాంక్షలు చెప్పలేదని ఫైర్ అవుతున్నారు.

ఇక పృథ్వి వ్యాఖ్యలను ఇప్పటికే వైసీపీకే సపోర్ట్ చేసిన మరో నటుడు పోసాని ఖండించారు. సురేష్ బాబు లాంటి వాళ్లు జగన్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నా జగన్ బిజీగా ఉండడందో కుదర్లేదని.. త్వరలోనే ఆయనతో పాటు మరికొందరు జగన్ ను కలుస్తారని చెప్పారు. ఇక తాజాగా మరో సీనియర్ నటుడు- మా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా పృథ్వికి కౌంటర్ ఇచ్చారు. తనకు జగన్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూనే ఆయన్ను ఈ రోజే కలవాల్సి ఉందని… అనివార్య కారణాలతో రెండు మూడు రోజుల్లో కలుస్తున్నట్టు పేర్కొన్నారు.