ఇక పార్టీ సభ్యుడిని మాత్రమే.. ట్విట్టర్‌లో రాహుల్

| Edited By:

Jul 03, 2019 | 9:17 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో మార్పులు చేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు లేఖ ద్వారా రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే తన ట్విట్టర్ ఖాతాలో కూడా మార్పులు చేశారు. తన పదవికి రిజైన్ చేసినట్లే అని చెప్పుకోవడానికి […]

ఇక పార్టీ సభ్యుడిని మాత్రమే.. ట్విట్టర్‌లో రాహుల్
Follow us on

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో మార్పులు చేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు లేఖ ద్వారా రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే తన ట్విట్టర్ ఖాతాలో కూడా మార్పులు చేశారు. తన పదవికి రిజైన్ చేసినట్లే అని చెప్పుకోవడానికి ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఉన్న.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గుర్తింపును తొలగించారు. ఆ స్థానంలో ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా పేర్కొంటూ అప్ డేట్ చేశారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడి కోసం పలువురి సీనియర్ నేతల పేర్లను ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.