మోదీ చాపర్‌లో ఏం తీసుకెళ్తున్నారో..? దొరికిందయ్యా కాంగ్రెస్‌కు ఛాన్స్

| Edited By:

Apr 18, 2019 | 4:32 PM

న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు చేసే ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. దీనిలో భాగంగా మంత్రులు, ముఖ్యమంత్రుల వాహనాలు, హెలికాప్టర్లు కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారానికి రూర్కెలా వెళ్లిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుమారస్వామి హెలికాప్టర్‌లోని లగేజీని ఈసీ అధికారులు తనిఖీ చేశారు. ఆ రాష్ట్ర […]

మోదీ చాపర్‌లో ఏం తీసుకెళ్తున్నారో..? దొరికిందయ్యా కాంగ్రెస్‌కు ఛాన్స్
Follow us on

న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు చేసే ప్రయత్నాలను ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. దీనిలో భాగంగా మంత్రులు, ముఖ్యమంత్రుల వాహనాలు, హెలికాప్టర్లు కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారానికి రూర్కెలా వెళ్లిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. కుమారస్వామి హెలికాప్టర్‌లోని లగేజీని ఈసీ అధికారులు తనిఖీ చేశారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్ప, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చాపర్లను కూడా ఫ్లయింగ్ స్వ్కాడ్స్‌ తనిఖీ చేశాయి.

ఎన్నికల వేళ ఎంతటి ముఖ్యమైన నేతలను అయినా తనిఖీ చేస్తామని, అక్రమాలు జరగకుండా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిపై వేటు పడటం చర్చనీయాంశమైంది. ఈ సోదాలపై ఈసీ ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. ఎస్పీజీ రక్షణ ఉన్న ప్రధాని వంటి వీవీఐపీలకు తనిఖీ నుంచి మినహాయింపు ఉంటుందని, ఈసీ ఆదేశాలను తనిఖీ అధికారి మొహిసిన్ ఉల్లంఘించారని ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ.. ఆయన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది.

అయితే ఎన్నికల కమిషన్ తీరును కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తనిఖీలు చేపట్టిన అధికారిపై వేటు వేయడం సరైంది కాదని.. ప్రధాని ఏం తీసుకెళ్తున్నారో.. దేశ ప్రజలు కూడా చూడాలి కదా.. అంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్‌లో పేర్కొంది.