చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి అవసరం లేదు.. : పోసాని

| Edited By:

Jun 17, 2019 | 10:36 AM

ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. జీవితంలో తనకు ఓ కల, ఆకాంక్ష ఉండేదని.. అది వైఎస్ జగన్ సీఎం అవ్వడమని అన్నారు. ఎట్టకేలకు నా జీవిత కల నెరవేరిందని అన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీది ముగిసిన అధ్యాయమా అన్న ప్రశ్నకి.. ఆయన సమాధానమిచ్చారు. తెలుగు దేశం పార్టీది ఇప్పడే ముగిసిన అధ్యాయం కాదని.. అయితే రాష్ట్రానికి మాత్రం […]

చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి అవసరం లేదు.. : పోసాని
Follow us on

ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. జీవితంలో తనకు ఓ కల, ఆకాంక్ష ఉండేదని.. అది వైఎస్ జగన్ సీఎం అవ్వడమని అన్నారు. ఎట్టకేలకు నా జీవిత కల నెరవేరిందని అన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీది ముగిసిన అధ్యాయమా అన్న ప్రశ్నకి.. ఆయన సమాధానమిచ్చారు. తెలుగు దేశం పార్టీది ఇప్పడే ముగిసిన అధ్యాయం కాదని.. అయితే రాష్ట్రానికి మాత్రం టీడీపీ లాంటి పార్టీతో కానీ.. చంద్రబాబు వంటి నాయకుడు కానీ అవసరం లేదన్నారు.