కమలం పాలిట కారంగా మారిన పసుపు..!

| Edited By:

Jul 28, 2019 | 2:30 PM

పసుపే కదా కడిగేసుకుందాంలే.. అనుకుంటే అలాగే వుంటుంది మరి.. అనవసరంగా పసుపుతో పెట్టుకున్నాం.. మసైపోతామేమో అన్న భయం పట్టుకుంది ఇప్పుడు బీజేపీకి. నిజామాబాద్ ఎంపీగా తనని గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు బీజేపీ అభ్యర్ధి అరవింద్. ఒకవేళ తేలేక పోతే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా బాండ్ పేపరే రాసిచ్చేశారు. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఓటమికి కారణమైంది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్నాళ్ళయినా కేంద్రంలో పసుపు బోర్డు ఊసేలేదు. […]

కమలం పాలిట కారంగా మారిన పసుపు..!
Follow us on

పసుపే కదా కడిగేసుకుందాంలే.. అనుకుంటే అలాగే వుంటుంది మరి.. అనవసరంగా పసుపుతో పెట్టుకున్నాం.. మసైపోతామేమో అన్న భయం పట్టుకుంది ఇప్పుడు బీజేపీకి.

నిజామాబాద్ ఎంపీగా తనని గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు బీజేపీ అభ్యర్ధి అరవింద్. ఒకవేళ తేలేక పోతే పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా బాండ్ పేపరే రాసిచ్చేశారు. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఓటమికి కారణమైంది. అయితే ఎన్నికలు ముగిసి ఇన్నాళ్ళయినా కేంద్రంలో పసుపు బోర్డు ఊసేలేదు. దాంతో తెస్తే పపుపు బోర్డయినా తేవాలి.. లేదా అరవింద్ రాజీనామా చెయ్యాలనే విమర్శలు మొదలయ్యాయి.

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి.. పసుపు బోర్డ్ హామీ తమ కొంప ముంచుతుందేమోనని భయం పట్టుకుంది.
మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా ఆర్మూరు, బీంగల్, బోధన్, నిజామాబాద్ కార్పొరేషన్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే అరవింద్ ఇచ్చిన నిజాం షుగర్స్, పసుపు బోర్డు హామీలకు నేతల దగ్గర సమాధానం లేకపోవడంతో .. అధికారపార్టీకి అవి అస్త్రాలు మారాయి.

మరోవైపు జిల్లా బీజేపీ నాయకత్వం కూడా అరవింద్ తీరుపై అసంతûప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటెద్దు పోకడలతో అరవింద్ సీనియర్లను పట్టించుకోవడంలేదనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. అమలు కానీ హామీలతో పార్టీని ఇరకాటంలో పడేశారంటూ భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని అందించిన పసుపు మున్సిపల్ ఎన్నికల్లో కారమై కళ్లలో పడటం ఖాయమనే ఆందోళన పట్టుకుంది కమలదళానికి.