ఆపరేషన్ టీఆర్ఎస్‌కు పక్కా ప్లాన్ వేసిన డీకే అరుణ

| Edited By:

Jul 19, 2019 | 3:56 PM

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని.. బీజేపీ భావిచింది. కానీ షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. ఒకవైపు డీకే అరుణ.. మరోవైపు జితేందర్ రెడ్డి. ఇంకేముంది.. ఎంపీ స్థానం మనదే అనుకున్నారు కమలనాథులు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. దీంతో డీకే అరుణ టీఆర్ఎస్ పార్టీపై రివేంజ్ తీసుకునేందకు స్కెచ్ వేస్తున్నారట. టీఆర్ఎస్ పార్టీ నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారట. ఇంతకీ డీకే అరుణకి టచ్‌లో […]

ఆపరేషన్ టీఆర్ఎస్‌కు పక్కా ప్లాన్ వేసిన డీకే అరుణ
Follow us on

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదని.. బీజేపీ భావిచింది. కానీ షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. ఒకవైపు డీకే అరుణ.. మరోవైపు జితేందర్ రెడ్డి. ఇంకేముంది.. ఎంపీ స్థానం మనదే అనుకున్నారు కమలనాథులు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. దీంతో డీకే అరుణ టీఆర్ఎస్ పార్టీపై రివేంజ్ తీసుకునేందకు స్కెచ్ వేస్తున్నారట. టీఆర్ఎస్ పార్టీ నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారట. ఇంతకీ డీకే అరుణకి టచ్‌లో ఉన్న గులాబీ కండువాలేంటి.. ?

తెలంగాణలో అతి త్వరలోనే టీఆర్ఎస్‌కి షాక్ ఇవ్వడానికి డీకే అరుణ స్కెచ్ గీస్తున్నారని తెలుస్తోంది. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లోనూ డీకే అరుణ ఇదే చెప్పారు. కానీ.. ఎంపీ అభ్యర్ధిగా ఓటమి పాలై ఆవిడే షాక్‌కి గురవ్వాల్సి వచ్చింది. మరిప్పుడు డీకే అరుణ ప్రతికార చర్యని పక్కాగా ప్లాన్ చేస్తారా..?

తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యమని ఇప్పటికే బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పిందట. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల నుంచి సీనియర్ లీడర్లకు వెల్‌కమ్ సాంగ్ పడింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ కాషాయ కండువా వేసుకోవడం పెద్ద కలకలమే రేపింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. గత లోక్‌సభలో టీఆర్ఎస్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కూడా సొంతకూటికి వచ్చేశారు. దీంతో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం తమదే అని బీజేపీ చాలా ధీమాను ప్రదర్శించింది. కానీ డీకే అరుణ ఓటమిపాలైంది. జాతీయ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే అరుణ పార్టీలో చేరిన ప్రయోజనం లేకుండా పోయిందన్న వార్తలు ఒక్కసారిగా పెరగడంతో.. ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆపరేషన్ టీఆర్ఎస్ మొదలుపెట్టారట.

తన బలాన్ని నిరూపించుకోవాలని పట్టుబట్టిన డీకే అరుణ టీఆర్ఎస్ ముఖ్యనేతలకు కాషాయకండువా కప్పే పనిలో బిజీగా ఉన్నారట. ఈ క్రమంలోనే.. టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత దొరకక ఇబ్బంది పడుతోన్న లీడర్లను టార్గెట్ చేశారట. టీఆర్ఎస్ పార్టీలోని ఒక ప్రముఖ నేతతో పాటుగా.. ఒక ప్రజాప్రతినిధి కూడా డీకే అరుణతో రహస్య మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల కన్నా ముందుగా వాళ్లని పార్టీలో చేర్చుకోవాలని డీకే అరుణ ప్రయత్నిస్తున్నారట. కానీ.. మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాతే కాషాయ కండువా వేసుకునే ఆలోచనలో వారిద్దరూ ఉన్నారట.

అటు జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల మీద ఫోకస్ పెట్టిన డీకే అరుణ మున్సిపల్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్‌లో కలవరం పుట్టించడానికి ప్లాన్ చేస్తున్నారట. ద్వితీయ స్థాయి నేతలకు కాషాయ కండువాలు వేసి.. ఆ తర్వాత బడా నేతలకు వెల్‌కమ్ సాంగ్ ప్లే చేయాలని భావిస్తున్నారట. అయితే డీకే అరుణ వ్యూహాలను నిశితంగా గమనిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం.. ఆమెతో టచ్‌లో ఉన్న గులాబీ కండువాలు ఎవరన్నది ఆరా తీస్తోందట. దీంతో.. ఇప్పుడైనా డీకే అరుణ ఎత్తుగడ ఫలిస్తుందా.. లేదా అన్నది కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారిందట.