మళ్లీ కేంద్రంలో వచ్చేది బీజేపీనే : ప్రధాని మోదీ

| Edited By:

Apr 06, 2019 | 6:06 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోనూ ఈసారి కమలం వికసించడం కాయమని.. బీజేపీ విజయభేరి మోగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సమగ్రాభివృద్ధికి పాటుపడే ప్రభుత్వం కావాలో, అవినీతి సర్కార్‌ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. గిరిజన ప్రాబల్య సుందర్‌గఢ్‌లో ప్రధాని మోదీ శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇక కేంద్రంలో కూడా మరోసారి కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో ఈసారి బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని […]

మళ్లీ కేంద్రంలో వచ్చేది బీజేపీనే : ప్రధాని మోదీ
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోనూ ఈసారి కమలం వికసించడం కాయమని.. బీజేపీ విజయభేరి మోగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సమగ్రాభివృద్ధికి పాటుపడే ప్రభుత్వం కావాలో, అవినీతి సర్కార్‌ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. గిరిజన ప్రాబల్య సుందర్‌గఢ్‌లో ప్రధాని మోదీ శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇక కేంద్రంలో కూడా మరోసారి కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో ఈసారి బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణ, వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రంలో పటిష్ఠ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇక బీజేపీ వ్యవస్ధాపక దినం సందర్భంగా ప్రధాని కార్యకర్తల కృషిపై ప్రశంసలు గుప్పించారు. పార్టీని కార్యకర్తలు చెమటోడ్చి ఈ స్ధాయికి తీసుకువచ్చారని, తమకు వారసత్వ మూలాలు కానీ, ధనం కానీ లేవని చెప్పారు. కార్యకర్తల కృషి, నిర్మాణ దక్షతతోనే తమ పార్టీ ఎదిగిందన్నారు.