జగన్ విజయంతో పెరిగిపోయిన పీకే డిమాండ్

| Edited By:

Jun 25, 2019 | 5:12 PM

ఏపీలో వైసీపీ ఘన విజయం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సీఎం జగన్‌దా లేక వెనకుండి నడిపించిన పీకేదా. ఇదే చర్చనీయాంశంగా మారింది. అప్పటివరకు ప్రభుత్వంలో కొనసాగిన పార్టీకి కేవలం 23 సీట్లు మిగిల్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన పొలిటికల్ స్ట్రాటజీ పీకేదేనా? పదేళ్ల క్రితం వైఎస్ జగన్ ఒక్కరే. ఆయన ఆయన 2014 ఎన్నికల్లో పోరాడి ఓడిపోయారు. అయినప్పటికీ ఫ్యాన్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ మారి టీడీపీ గూటికి వెళ్లిపోయారు. అయినప్పటికీ జగన్ ఏమాత్రం […]

జగన్ విజయంతో పెరిగిపోయిన పీకే డిమాండ్
Follow us on

ఏపీలో వైసీపీ ఘన విజయం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సీఎం జగన్‌దా లేక వెనకుండి నడిపించిన పీకేదా. ఇదే చర్చనీయాంశంగా మారింది. అప్పటివరకు ప్రభుత్వంలో కొనసాగిన పార్టీకి కేవలం 23 సీట్లు మిగిల్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన పొలిటికల్ స్ట్రాటజీ పీకేదేనా? పదేళ్ల క్రితం వైఎస్ జగన్ ఒక్కరే. ఆయన ఆయన 2014 ఎన్నికల్లో పోరాడి ఓడిపోయారు. అయినప్పటికీ ఫ్యాన్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ మారి టీడీపీ గూటికి వెళ్లిపోయారు. అయినప్పటికీ జగన్ ఏమాత్రం అదరలేదు బెదరలేదు. ఖచ్చితంగా 2019నాదే అనే ధైర్యంతో ముందుకు సాగారు. ఆయన అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణమేంటి?

పార్టీని ఒక పద్దతి ప్రకారం నడిపించి ఎక్కడికక్కడ జగన్ వేసే ప్రతి అడుగును తీర్చిదిద్దిన ఘనత పీకేకే దక్కుతుందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీని తిరుగులేని విజేతగా నిలిపిన రాజకీయ వ్వ్యూహకర్తకు అమాంతం ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడిందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకదశలో టీడీపీ కూడా పీకేను సంప్రదించేందుకు రెడీ అయ్యిందని వార్తలొచ్చాయి. మరోవైపు బెంగాల్ దీదీ మమతా బెనర్జీ కూడా పీకే సేవల్ని వినియోగించుకోవాలి నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బ్రహ్మాండమైన విక్టరీ కొట్టిన పీకే పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇదిలా ఉంటే తమిళ రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు కమల్ హాసన్ కూడా పీకేతో సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి. దీనికి కారణం వీరిద్దరూ భేటీ కావడమే.

మొత్తానికి ఏపీలో జగన్ సీఎం కావడం వెనుక పక్కా స్కెచ్ వేసి అధికారంలో కూర్చోబెట్టిన పీకేకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగినట్టే కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో చూడాలి.