యాక్టివ్‌ అయిన జనసేన ఖాతాలు.. పవన్ థ్యాంక్స్

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2019 | 12:47 PM

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఏ కారణం వలన తమ పార్టీ సపోర్టర్ల ఖాతాలను సస్పెండ్ చేశారంటూ ఆ సంస్థను ప్రశ్నించారు. ఆ తరువాత #BringBackJSPSocialMedia అనే హ్యాష్‌ట్యాగ్‌ను పవన్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ఈ హ్యాష్‌ ట్యాగ్‌ను జన సైనికులు వాడుతూ విస్తృత ప్రచారం చేశారు. దీంతో స్పందించిన […]

యాక్టివ్‌ అయిన జనసేన ఖాతాలు.. పవన్ థ్యాంక్స్
Follow us on

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఏ కారణం వలన తమ పార్టీ సపోర్టర్ల ఖాతాలను సస్పెండ్ చేశారంటూ ఆ సంస్థను ప్రశ్నించారు. ఆ తరువాత #BringBackJSPSocialMedia అనే హ్యాష్‌ట్యాగ్‌ను పవన్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ఈ హ్యాష్‌ ట్యాగ్‌ను జన సైనికులు వాడుతూ విస్తృత ప్రచారం చేశారు. దీంతో స్పందించిన ట్విట్టర్ సంస్థ ఆ ఖాతాలను మళ్లీ యాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని పవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

‘‘మా అభ్యర్థనకు త్వరగా స్పందించి, రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛకు విలువను ఇచ్చి జనసేన పార్టీ ఫాలోవర్ల ట్విట్టర్ అకౌంట్‌ను యాక్టివ్ చేసినందుకు, ట్విట్టర్ ఇండియా సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పవన్ ట్వీట్ చేశారు. కాగా జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆ మాధ్యమం వేదికగా పలు సమస్యలపై వారు ప్రశ్నిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో సేవ్ నల్లమల, వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే హ్యాష్‌ట్యాగ్‌లను వారు ప్రచారం చేశారు.