గ్యాస్‌ లీక్ ఘటనలపై ఆందోళనలకు ఇది సమయం కాదు: పవన్‌

| Edited By:

May 09, 2020 | 6:07 PM

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయని.. దీని వలన కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ అన్నారు.

గ్యాస్‌ లీక్ ఘటనలపై ఆందోళనలకు ఇది సమయం కాదు: పవన్‌
Follow us on

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయని.. దీని వలన కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొనొద్దని ఆయన సూచించారు. ఆందోళనకు ఇది సరైన సమయం కాదని, బాధితులకు అండగా ఉండాల్సిన సమయమని పవన్ చెప్పారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తుది నివేదికలు వచ్చే దాకా వేచి చూడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు సాయం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విఙ్ఞప్తి చేశారు. కాగా గురువారం విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఆ అద్భుత దృశ్యకావ్యం సీక్వెల్‌ కోసం జాన్వీ ఒప్పుకుంటుందా..!