సిద్ధూకి సీఎం అవ్వాలని కోరిక ఉంది: అమరీందర్‌సింగ్‌

|

May 19, 2019 | 9:28 PM

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, తన మంత్రివర్గంలోని నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని భర్తీ చేయాలని సిద్ధూ అనుకుంటున్నారని అన్నారు. సిద్ధూ తన ప్రవర్తనతో పార్టీ పరువును దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల తుది విడతలో ఓటు వేసేందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సిద్ధూతో ఎలాంటి మాటల యుద్ధం లేదు. ప్రజలందరికీ లక్ష్యాలుంటాయి. ఆయనకు కూడా బలమైన లక్ష్యం ఉంటే చాలా మంచిది. ఆయన […]

సిద్ధూకి సీఎం అవ్వాలని కోరిక ఉంది: అమరీందర్‌సింగ్‌
Follow us on

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, తన మంత్రివర్గంలోని నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని భర్తీ చేయాలని సిద్ధూ అనుకుంటున్నారని అన్నారు. సిద్ధూ తన ప్రవర్తనతో పార్టీ పరువును దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల తుది విడతలో ఓటు వేసేందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సిద్ధూతో ఎలాంటి మాటల యుద్ధం లేదు. ప్రజలందరికీ లక్ష్యాలుంటాయి. ఆయనకు కూడా బలమైన లక్ష్యం ఉంటే చాలా మంచిది. ఆయన నాకు చిన్నతనం నుంచే తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు’’ అని సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు.

కొద్ది రోజుల క్రితం వీరిద్దరి మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకున్నాయి. సిద్ధూ భార్య నవ్‌జ్యోత్‌ కౌర్‌కు చండీగఢ్‌ సీటు కేటాయించకపోవడానికి ముఖ్యమంత్రే కారణమని సిద్ధూ ఆరోపించారు. కానీ, అమృత్‌సర్‌, లేదా బటిండా  స్థానానికి కాంగ్రెస్‌ తరఫున సీటు కేటాయించాలని సీఎం అనుకున్నారు. అయితే అందుకు కౌర్‌ తిరస్కరించారు. సిద్ధూ బాధ్యతారహిత చర్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని సీఎం అన్నారు.