ఆర్కే గెలిస్తే.. మంత్రి అవుతాడు- జగన్‌

| Edited By: Srinu

Apr 09, 2019 | 7:34 PM

మంగళగిరి : నా సోదరుడు లాంటి వ్యక్తి ఆర్కే..ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు.  ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను దోపిడిదారుల నుంచి  కాపాడుతాడు.. మీ కుటుంబాలకు అండగా ఉంటాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని జగన్ మంగళగిరి ప్రజలకు హామి  ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజున మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ప్రతి కుంభకోణం మంగళగిరి కేంద్రంగానే జరిగిందన్నారు. ఇక్కడి రైతుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి చంద్రబాబు […]

ఆర్కే గెలిస్తే.. మంత్రి అవుతాడు- జగన్‌
Follow us on

మంగళగిరి : నా సోదరుడు లాంటి వ్యక్తి ఆర్కే..ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు.  ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను దోపిడిదారుల నుంచి  కాపాడుతాడు.. మీ కుటుంబాలకు అండగా ఉంటాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని జగన్ మంగళగిరి ప్రజలకు హామి  ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజున మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ప్రతి కుంభకోణం మంగళగిరి కేంద్రంగానే జరిగిందన్నారు. ఇక్కడి రైతుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకుందని, ఆయన కుమారుడు లోకేష్‌ను కూడా ఓడించాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. అసలు ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు అంటే ఏంటో తెలియని వ్యక్తిని చంద్రబాబు మంగళగిరిపై రుద్దాలని చూస్తున్నారని..ప్రజలంతా ఏకమై ఈ కుట్రను తిప్పి కొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే చేనేత వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని, నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చారు.