టీడీపీ గెలిస్తే ఈవీఎం తీర్పును ఏమంటారు : కేటీఆర్

| Edited By:

Apr 14, 2019 | 6:13 PM

హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పని తీరును ప్రశ్నిస్తున్నారని, ఆయన ప్రవర్తనలో ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచిన బాబు.. నేడు మాత్రం వాటిని ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. ఎవరు గెలుస్తారనేది మే 23న తెలిపోతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతవుతాయని […]

టీడీపీ గెలిస్తే ఈవీఎం తీర్పును ఏమంటారు : కేటీఆర్
Follow us on

హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల పని తీరును ప్రశ్నిస్తున్నారని, ఆయన ప్రవర్తనలో ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచిన బాబు.. నేడు మాత్రం వాటిని ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. ఎవరు గెలుస్తారనేది మే 23న తెలిపోతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో స్థానిక పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.