Review Meeting: నిర్వాసితులకు పరిహారం అందించండి… వారి త్యాగం మరువలేనిది… మంత్రి కేటీఆర్

| Edited By:

Dec 29, 2020 | 5:32 AM

ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం మరువలేనిదని, వారి పట్ల అధికారులు ఉదార స్వభావంతో వ్యవహరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Review Meeting: నిర్వాసితులకు పరిహారం అందించండి... వారి త్యాగం మరువలేనిది... మంత్రి కేటీఆర్
Follow us on

ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం మరువలేనిదని, వారి పట్ల అధికారులు ఉదార స్వభావంతో వ్యవహరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. మధ్యమానేరు జలాశయ నిర్మాణంలో ముంపునకు గురైన 11 గ్రామాల్లో ఇంకా మిగిలిన నిర్వాసితులందరికీ పరిహారం అందజే యాలని, వెంటనే అర్హులను గుర్తించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) నిర్వాసితుల సమస్యలపై హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమయ్యారు.

 

పరిహారం అందించండి…

అర్హత ఉండి ఇంకా పరిహారం పొందని 701 నివాసాలకు తక్షణమే లబ్ధికలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మాన్వాడ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి మిగిలిన 197మంది లబ్ధిదారులకు వెంటనే పరిహారాన్ని విడుదల చేయాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింప జేయాలని సూచించారు. 18ఏళ్లు నిండిన యువతీ, యువకులకు కూడా పరిహారాన్ని అందజేయాలన్న మంత్రి, స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని, ఇందుకు కావాల్సిన చర్యలను వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఈఎన్‌సీ అధికారులు అనిల్‌కుమా ర్‌, మురళీధర్‌రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ ఈఈ రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.