టీడీపీని వీడాలనుకున్న కోడెల.. గొడవ అక్కడే మొదలైందా..!

| Edited By:

Sep 17, 2019 | 7:48 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఆయనది ఆత్మహత్యేనని పోస్ట్‌మార్టం నివేదికలో డాక్టర్లు తేల్చారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆయన శరీరంపై ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. అయినా కోడెల మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకున్న ఆయనను దగ్గరున్న ఆసుపత్రికి తరలించకుండా.. దూరంగా ఉన్న బసవతారకంకు తరలించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఆయన […]

టీడీపీని వీడాలనుకున్న కోడెల.. గొడవ అక్కడే మొదలైందా..!
Follow us on

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఆయనది ఆత్మహత్యేనని పోస్ట్‌మార్టం నివేదికలో డాక్టర్లు తేల్చారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆయన శరీరంపై ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. అయినా కోడెల మృతిపై పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరేసుకున్న ఆయనను దగ్గరున్న ఆసుపత్రికి తరలించకుండా.. దూరంగా ఉన్న బసవతారకంకు తరలించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఆయన పార్ధివదేహాన్ని చూసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడెల మెడపై గాట్లు ఉన్నాయని చెప్పడంతో అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. ఏది ఏమైనా కోడెల హఠాన్మరణంపై ఇప్పుడు రాజకీయం మొదలైంది.

కేసుల పేరుతో వైసీపీ ప్రభుత్వం పెట్టిన టార్చర్ వల్లనే కోడెల తనువు చాలించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కోడెల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఆయనను హత్య చేయించారని మేనల్లుడు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయనది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు పడ్డారు.

ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో గొప్ప నేతగా ఎదిగిన ఆయన.. వైసీపీ అధికారంలోకి రాగానే వివాదాస్పద నేతగా మారిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు కోడెల కుటుంబం ఎన్నో అక్రమాలు చేసిందని.. ముఖ్యంగా కేటాక్స్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు అసెంబ్లీ పర్నీచర్‌ను తన ఇంటికి తరలించడంపై ఆయనపై వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక సొంత పార్టీలో కూడా ఆయనకు వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక ఆయన టీడీపీ పార్టీని వీడాలని అనుకున్నారని సమాచారం. ఈ మేరకు బీజేపీ నేతలు కంభంపాటి రామ్మోహన్, సుజనా చౌదరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలోనే కుమారుడు శివ రామకృష్ణతో గొడవలు జరిగాయని.. గత కొన్ని నెలలుగా కుటుంబంలో గొడవల వలన ఆయన మనస్తాపానికి గురి అవుతూ వచ్చారని సన్నిహితులు కొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డట్లు సమాచారం. ఏది నిజమో..? ఎందుకు కోడెల ఆత్మహత్య చేసుకున్నారో..? పల్నాడు పులిగా పేరొందిన ఆయన మరణం వెనుక కారణాలేంటో..? లాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.