కేసీఆర్‌కు మళ్లీ ఫ్రంట్ గుర్తొచ్చింది

| Edited By:

May 06, 2019 | 12:09 PM

సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ చివరి దశకు చేరుకుంటుండటంతో ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించిన పనులలో స్పీడును పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి వచ్చే పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడులో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట కేరళ సీఎం పినరయి విజయన్‌తో సంప్రదింపులు జరుపనున్నారు. ఆ తరువాత ఈ నెల 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. […]

కేసీఆర్‌కు మళ్లీ ఫ్రంట్ గుర్తొచ్చింది
Follow us on

సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ చివరి దశకు చేరుకుంటుండటంతో ఫెడరల్ ఫ్రంట్‌కు సంబంధించిన పనులలో స్పీడును పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి వచ్చే పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడులో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట కేరళ సీఎం పినరయి విజయన్‌తో సంప్రదింపులు జరుపనున్నారు. ఆ తరువాత ఈ నెల 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయాలపై ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పనిలో పనిగా ఈ పర్యటనలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను కూడా కేసీఆర్ సందర్శించనున్నారు. తమిళనాడు, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అనంత పద్మనాభస్వామి, కన్యకా పరమేశ్వరి, రామేశ్వరం, మధుర మీనాక్షి, శ్రీరంగం దేవాలయాలను వారు దర్శించుకోనున్నారు.