మేము పార్టీ మారితే తప్పేంటి..? కామన్ అది..!

| Edited By: Srinu

May 25, 2019 | 6:27 PM

ఏపీలో ఇంత ఘన విజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడి జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు నటుడు రాజశేఖర్, భార్య జీవిత. ఈ సందర్భంగా భార్యభర్తలు మాట్లాడుతూ.. జగన్‌ను ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరికిందని మేము ఫీలవుతున్నామన్నారు. ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి చాలా సమస్యలు మమ్మల్ని బాధపెట్టాయి. మాకొచ్చిన అవకాశాన్ని ఇప్పుడు మేము ఉపయోగించుకున్నామన్నారు. 3,600 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు జగన్.. ఇది మామోలు విషయం […]

మేము పార్టీ మారితే తప్పేంటి..? కామన్ అది..!
Follow us on

ఏపీలో ఇంత ఘన విజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడి జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు నటుడు రాజశేఖర్, భార్య జీవిత. ఈ సందర్భంగా భార్యభర్తలు మాట్లాడుతూ.. జగన్‌ను ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరికిందని మేము ఫీలవుతున్నామన్నారు. ప్రత్యేక హోదా విషయం దగ్గర నుంచి చాలా సమస్యలు మమ్మల్ని బాధపెట్టాయి. మాకొచ్చిన అవకాశాన్ని ఇప్పుడు మేము ఉపయోగించుకున్నామన్నారు. 3,600 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు జగన్.. ఇది మామోలు విషయం కాదని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క ఇంటికి వెళ్లి ఆయన సమస్యలను పరిష్కరించడానికి చాలా తాపత్రయం వ్యక్తం చేసిన వ్యక్తి ‘జగన్’ అని అన్నారు.

ఓటు హక్కు వచ్చినప్పటి నుంచీ ఎవరూ ఒకే పార్టీ ఓటు వేయట్లేదు.. కదా.. అలాగే.. మేము పార్టీ మారితే తప్పేంటి..? మాకు ఆయనలో నిజాయితీ కనిపించింది.. అందుకే అతనికి మద్దతు ఇచ్చామన్నారు. అలాగే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు చాలా తెలివివంతులు.. ఎవరికి ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుందని వాళ్లకు తెలుసని అన్నారు. అలాగే.. ఖచ్చితంగా ఏపీ ప్రత్యేక హోదా జగన్ తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జీవితా రాజశేఖర్‌లు.