కదిలే ‘సేన’ నాది.. రూమర్స్ నమ్మకండి

పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇవి కాస్త ఆయన వద్దకు చేరడంతో దానిపై సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘నాపై ఈ ఉదయం నుంచి వస్తున్న వార్తలు చూసి షాక్‌కు గురయ్యా. వ్యతిరేకపరులు పుకార్లను వ్యాపిస్తుంటారు. ఫూల్స్ వాటిని విస్తరిస్తుంటారు. ఇడియట్‌లు వాటిని […]

కదిలే ‘సేన’ నాది.. రూమర్స్ నమ్మకండి

Updated on: Aug 10, 2019 | 5:37 PM

పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇవి కాస్త ఆయన వద్దకు చేరడంతో దానిపై సోషల్ మీడియాలో స్పందించాడు.

‘‘నాపై ఈ ఉదయం నుంచి వస్తున్న వార్తలు చూసి షాక్‌కు గురయ్యా. వ్యతిరేకపరులు పుకార్లను వ్యాపిస్తుంటారు. ఫూల్స్ వాటిని విస్తరిస్తుంటారు. ఇడియట్‌లు వాటిని నమ్ముతుంటారు.. అందులో మీరు ఎవరో మీరే తేల్చుకోండి’’ అని ట్వీట్ చేశారు.

ఆ తరువాత ‘‘నా సేవలు జనసేన అధినేతకు అవసరం అయ్యే వరకు అదే పార్టీలో ఉంటాను. ఇలాంటి పుకార్లతో మీ సమయాన్ని వృథా చేసుకోకండి. ఆ సమయాన్ని వరద బాధితులకు సహాయం చేస్తూనో, మొక్కలను నాటడానికో, ప్లాస్టిక్‌ను తొలగించేందుకో, యువతలో స్ఫూర్తిని కలిగించేందుకో ఉపయోగించండి. జై హింద్’’ అని ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us