ప్రశాంత్ కిషోర్‌తో జగన్ భేటీ

| Edited By:

Apr 12, 2019 | 7:52 PM

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, సర్వే వివరాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్‌కు జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీకే టీం పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ సూచనలను జగన్ అమలు పరిచారు. ఎన్నికలకు ముందు టీం నియోజకవర్గాల వారిగా ప్రచారం చేసింది. పీకే సూచనలతోనే జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని […]

ప్రశాంత్ కిషోర్‌తో జగన్ భేటీ
Follow us on

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, సర్వే వివరాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్‌కు జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీకే టీం పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ సూచనలను జగన్ అమలు పరిచారు. ఎన్నికలకు ముందు టీం నియోజకవర్గాల వారిగా ప్రచారం చేసింది. పీకే సూచనలతోనే జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.

గురువారం పీకే మీడియాతో మాట్లాడుతూ తనకు ఓటమి తప్పదని తెలుసుకున్న చంద్రబాబు.. నకిలీ సర్వేలు ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. అదేసమయంలో వైసీపీతో తాను విసిగిపోయానని, జగన్‌తో తనకు విభేదాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నానని అన్నారు. ఏపీ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.